రామారావు: ఆన్ డ్యూటీ.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమా మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే కనిపిస్తోంది. ఈ చిత్రాన్నిరూపొందించిన శరత్ మండవను అందరూ కొత్త దర్శకుడు అని అంటున్నారు. సోషల్ మీడియా, వెబ్ మీడియాలో కూడా చాలామంది అలాగే రాసేస్తున్నారు. కానీ శరత్ టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న మాట వాస్తవమే కానీ.. అతడికి దర్శకుడిగా ఇది తొలి సినిమా మాత్రం కాదు.
శరత్ చాలా ఏళ్లు తమిళ ఫిలిం ఇండస్ట్రీలోనే పని చేశాడు. అక్కడే ఓ సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా పేరు.. కో-2. కమల్ హాసన్ సంస్థ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్’లో కొన్నేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో డైరెక్టర్‌గా పని చేశాడు శరత్. కమల్ సినిమా ‘ఈనాడు’కు అతను దర్శకత్వ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు పని చేసి.. 2016లోనే ‘కో-2’తో శరత్ దర్శకుడిగా మారాడు.
‘కో-2’ సినిమాతో తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన అనువాద చిత్రం ‘రంగం’కు సీక్వెల్ కావడం విశేషం. తమిళంలో ఆ సినిమా పేరు.. కో. జీవా హీరోగా వీఐ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రానికి శరత్ సీక్వెల్ తీశాడు. కానీ సీక్వెల్ అని ప్రచారం జరిగింది కానీ.. కథంతా భిన్నంగా ఉంటుంది. బాబీ సింహా హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించాడు. నిక్కీ గర్లాని కథానాయిక. సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చాయి. ఓ మాదిరిగా ఆడింది. శరత్ ఆశించిన సక్సెస్ అయితే కాదు. దీంతో దర్శకుడిగా తమిళంలో మరో అవకాశం రాలేదు. చాలా ఏళ్లు వెయిట్ చేసి, రవితేజను ఒప్పించిన ‘రామారావు: ఆన్ డ్యూటీ’తో తెలుగులోకి అడుగు పెడుతున్నాడు శరత్.
ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి, శరత్ ఒకప్పుడు రూం మేట్స్ అట. శరత్ యుఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం వదులుకుని, ఇండియాకు వచ్చేసి సినిమా ప్రయత్నాలు చేసిన సమయంలో సుధాకర్‌తో కలిసి ఒకే అపార్ట్‌మెంట్లో ఉన్నాడట. ఆ పరిచయంతోనే ఇప్పుడు తన అరంగేట్ర చిత్రాన్ని సుధాకరే నిర్మించారట. మరి ఈ ఇద్దరు మిత్రులకు ‘రామారావు’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on July 26, 2022 2:58 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…