నగ్న తారకు రెండు లక్షలిచ్చారు!

రామ్ గోపాల్ వర్మ తీసిన నగ్నం సినిమా కొని చుసిన వాళ్ళు చీటింగ్ అంటూ తిట్టుకుంటున్నారు. ఇరవై నిమిషాల షార్ట్ ఫిలింకి రెండొందల రేట్ పెట్టడం చీటింగే కదా మరి. అయితే ఆ నగ్నం ప్రోమోలు చుసిన తర్వాత కూడా రెండొందల ప్రీమియం చెల్లించిన వారికి అలా జరగాల్సిందేనని చూడని వాళ్ళు నవ్వుతున్నారు. ఈ చిత్రాన్ని లక్ష రూపాయలలో తీశానని ప్రచారం చేసుకున్న వర్మ అక్కడ కూడా అబద్ధమే చెప్పాడట. ఎందుకంటే ఇందులో నటించిన స్వీటీ రెండు లక్షల పారితోషికం అడిగితే బేరం లేకుండా ఇచ్చేశారట.

పద్దెనిమిది రోజుల షూటింగ్, గంట డబ్బింగ్ చెప్పానని ఆమె చెప్పింది. అన్ని రోజుల షూటింగ్ కి లక్ష రూపాయలంటే నిజం కాదు. కాబట్టి సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఆర్జీవీ తన మార్కు ప్రచారమే చేసాడన్నమాట. ఇకపోతే ఈ చిత్రంతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ మరిన్ని అవకాశాల కోసం చూస్తోంది. మున్ముందు కూడా ఇలా ఎరోటిక్ సినిమాలు చేయడానికి అభ్యంతరం లేదని అంటోంది.