బీవీఎస్ రవి.. ఈ పేరుతో కంటే ‘మచ్చ రవి’ అనే పేరుతోనే బాగా ఫేమస్ అయిన రైటర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. రచయితగా 40కి పైగా సినిమాలకు పని చేశాడతను. అందులో ఖడ్గం, భద్ర, చక్రం అతిథి, మున్నా, పరుగు, కింగ్, తులసి, దేవుడు చేసిన మనుషులు, కెమెరామన్ గంగతో రాంబాబు.. ఇలా పేరున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
రచయితగా ఇలాంటి ఫిల్మోగ్రఫీ ఉన్న వ్యక్తి దర్శకుడిగా మారితే ఈజీగా క్లిక్ అయిపోతాడని అనుకుంటాం. కానీ మెగా ఫోన్ పట్టాక అతడి పరిస్థితి తలకిందులైంది. గోపీచంద్ లాంటి స్టార్‌తో అతడి అరంగేట్ర సినిమా కుదిరింది. కానీ వీరి కలయికలో వచ్చిన ‘వాంటెడ్’ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో దర్శకుడిగా చాలా గ్యాప్ తప్పలేదు. మళ్లీ కష్టపడి సాయిధరమ్ తేజ్‌తో ‘జవాన్’ అనే సినిమా తీస్తే తొలి చిత్రంతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చిందే తప్ప ప్రేక్షకాదరణ పొందలేదు.
దెబ్బకు దర్శకుడిగా సినిమాలు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.రచయితగా కూడా బీవీఎస్ రవికి చాన్నాళ్లుగా సినిమాలు లేవు. మధ్యలో బాలయ్యతో ‘అన్‌స్టాపబుల్’ షోను చాలా బాగా డీల్ చేయడంతో అతడి గురించి కొంచెం చర్చ జరిగింది. అదే టైంలో ‘థాంక్యూ’ సినిమాకు కథ అందించాడు రవి. విక్రమ్ కుమార్ లాంటి విలక్షణ దర్శకుడు.. రవి కథతో సినిమా చేస్తున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత, కొత్తదనం ఉంటుందనే అంతా అనుకున్నారు. కానీ తీరా సినిమా చూశాక అసలు ఈ కథలో ఏముందని విక్రమ్, దిల్ రాజు, చైతూ ఎగ్జైట్ అయ్యారో అర్థం కావట్లేదు ఎవ్వరికీ.
కొన్ని పాత సినిమాలను కలిపి తయారు చేసిన కథలా ఉంది తప్ప.. ఇందులో ఏ కొత్తదనం కనిపించలేదు. ఈ సినిమా వల్ల విక్రమ్ బ్రాండ్ వాల్యూ బాగా దెబ్బ తినేలా ఉంది. ఇంతకుముందు ఫ్లాప్ సినిమాల్లో కూడా తన మార్కు చూపించగలిగిన విక్రమ్.. ఈ సినిమాలో మాత్రం నిస్సహాయుడిగా కనిపించాడు. అందుకు విషయం లేని కథే కారణం అన్నది స్పష్టం. అందుకే బీవీఎస్ రవి ఇప్పుడు సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోయాడు. అతడి మీద ట్రోలింగ్ గట్టిగానే జరుగుతోంది. ఈ సినిమాతో వచ్చిన చెడ్డ పేరుతో రవి కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది.
This post was last modified on July 24, 2022 12:22 am
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…