ఈ రోజుల్లో చిన్న సినిమాలు తీసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అన్నది కఠిన సవాలుగా మారిపోయింది. మిడ్ రేంజ్ సినిమాలనే జనాలు పెద్దగా పట్టించుకోని పరిస్థితుల్లో చిన్న సినిమాల పట్ల జనాలను ఆకర్షించడం ఎంత కష్టమో చెప్పేదేముంది? కొత్త హీరో, కొత్త దర్శకుడు అంటే ఆ సినిమా గురించి జనాలు అసలు మాట్లాడుకోవడమే లేదు. అలాంటపుడు ప్రమోషన్ల పరంగా ఏదో భిన్నంగా, క్రేజీగా చేస్తే తప్ప జనాల్లో ఆ సినిమా గురించి చర్చ ఉండదు. ఆ మాత్రం చర్చ లేకుంటే సినిమాకు ఓటీటీ డీల్ దక్కడం కూడా కష్టమే. అందుకే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే చిత్ర బృందం ప్రమోషన్లను భలే వెరైటీగా ప్లాన్ చేసింది.
ఇది ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ శిష్యుడైన జగదీష్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్న సినిమా. అనుదీప్ సమర్పణలో తెరకెక్కింది. శిష్యుడి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి అనుదీప్ తనదైన శైలిలో ప్రమోషన్లు ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది. అతను ‘జాతిరత్నాలు’ టైంలో పాల్గొన్న టీవీ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారిన సంగతి తెలిసిందే.
అనుదీప్ ఏ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్నా అది చాలా వెరైటీగా, తిక్క తిక్కగా ఉంటుంది. ఇంతకుముందు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఫస్ట్ లుక్ లాంచ్‌కు సంబంధించిన వీడియో కూడా ఇలాగే ఉండి జనాలను అలరించగా.. ఇప్పుడు సాంగ్ లాంచ్ పేరుతో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ను కలిసి ఈ చిత్ర బృందం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అనుదీప్, జగదీష్‌లతో పాటు ఈ చిత్ర హీరో, నిర్మాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లి అల్లు అరవింద్‌ను తమాషాగానే ఒక ఆట ఆడేసుకున్నారు. మీతో ‘టై అప్ అవుతాం’ అంటూ టీంలో ఒక్కొక్కరు అరవింద్‌తో చేసిన కామెడీ ఈ వీడియోలో హైలైట్.
ఇక చివరికొచ్చేసరికి అసలు పాట అంటూ లేకుండానే.. పాటను లాంచ్ చేసినట్లు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలని అరవింద్‌కు చెప్పి ఆయనతో ఆ పని చేయించిన తీరు కొసమెరుపు. ఈ ప్రమోషనల్ వీడియో ఆద్యంతం అనుదీప్ మార్కుతో ఉండి.. జనాలను భలేగా ఎంటర్టైన్ చేస్తోంది. సినిమాకు ఈ ప్రమోషనల్ వీడియో ఎంత మేర ఉపయోగపడుతుందో కానీ.. ఈ వీడియో అయితే సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకునేలా ఉంది.
This post was last modified on July 23, 2022 9:47 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…