ప్రభాస్ తో మారుతి సినిమా లాకయిపోయింది. ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ ఎలా ఉన్నా మారుతికి ప్రభాస్ సినిమా చేయడం ఖాయమైంది. ముందుగా షూటింగ్ కి ఓ ప్లాన్ వేసుకున్నారు. ప్రభాస్ తక్కువ డేట్స్ తో సినిమా పూర్తి చేసేలా రెడీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ ప్రీ పోన్ చేసుకోనున్నారని తెలుస్తుంది. ప్రభాస్ తో మారుతి హారర్ జానర్ లో సినిమా చేయబోతున్నాడు. ఒక థియేటర్స్ లో ఉండే కేరెక్టర్స్ తో సినిమా హాల్ హారర్ కామెడీ అన్నట్టుగా ఏదో స్క్రిప్ట్ అంటున్నారు. ఆ లైన్ నచ్చే ప్రభాస్ మారుతికి ఓకె చెప్పాడని టాక్. ఆ థియేటర్ పేరు రాజా డీలక్స్ అని అందుకే సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
వచ్చే నెల అంటే ఆగస్ట్ నుండే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది. మారుతి ఈ లైన్ మీద చాలా నెలలుగా వర్క్ చేస్తున్నాడు. ఫైనల్ గా కొంత మంది రైటర్స్ తో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేశాడట. ముందుగా ప్రభాస్ ఓ పది రోజులు ఈ సినిమా కోసం కేటాయిస్తారని తర్వాత దశల వారిగా షూటింగ్ ఉంటుందని ఇన్సైడ్ టాక్. అంటే అటు సలార్ ఇటు ప్రాజెక్ట్ కే మధ్యలో మారుతి సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడన్నమాట.
ఈ కాంబో సినిమా ఇంత వరకూ ఎనౌన్స్ అవ్వలేదు. త్వరలోనే అఫీషియల్ గా న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అంచనాలు లేవు. రెబెల్ స్టార్ లైనప్ లో ఈ సినిమా లేకపోతే బాగున్ను అనుకుంటున్నారు. ఏదేమైనా మారుతి ‘ప్రేమ కథా చిత్రం’తో ఒకప్పుడు హారర్ సినిమాలకు ఊపు తీసుకొచ్చాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ జానర్ సినిమా చేస్తున్నాడంటే బాగానే ప్లాన్ చేసుకొని ఉంటాడు. తక్కువ బడ్జెట్ లో సినిమాను తీసి భారీగా మార్కెట్ చేసుకునే ప్లానింగ్ లో నిర్మాత దానయ్య ఉన్నారు.
This post was last modified on July 23, 2022 10:50 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…