బాలీవుడ్లో చాలా మంది కపుల్స్‌ను చూశాం. కానీ వాళ్లందరిలో అర్జున్ కపూర్-మలైకా అరోరాలది భిన్నమైన జంట. వేరే జంటల్లోనూ వయసు అంతరాలున్నాయి కానీ.. మరీ అర్జున్ కంటే మలైకాకు 11 ఏళ్లు పెద్దది కావడం.. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలుండడం చూసి అంతా ఈ జంట విషయంలో ఆశ్చర్యానికి గురయ్యారు. ముందు వీళ్లిద్దరి ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలొస్తే చాలామందికి నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ మలైకా.. అర్బాజ్ నుంచి విడాకులు తీసుకుని అర్జున్‌తో బహిరంగంగా కలిసి తిరగడంతో నమ్మక తప్పలేదు.
ఎవరేమనుకున్నా తమకు అనవసరం అంటూ ఈ జంట కొన్నేళ్ల నుంచి తమకు నచ్చినట్లు బతుకుతోంది. మలైకా కోసమని ఏకంగా రూ.20 కోట్లు పెట్టి తన పాత ఇంటికి దగ్గర్లోనే అర్జున్ బాంద్రా (ముంబయి)లో ఒక లగ్జరీ ఫ్లాట్ కూడా కొన్నాడు కొన్నేళ్ల ముందు. ఆ ఫ్లాట్లోనే ఈ జంట సహజీవనం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఐతే ఇప్పుడు అర్జున్ ఉన్నట్లుండి ఆ ఫ్లాట్‌ను అమ్మేయడం చర్చనీయాంశంగా మారింది. పైగా నష్టానికి ఆ ఫ్లాట్‌ను అమ్మేసినట్లు వార్తలొస్తుండడం గమనార్హం. 20 కోట్లకు కొని, 16 కోట్లకే ఫ్లాట్‌ను అమ్మాడట అర్జున్. ఇలా ఫ్లాట్ కొన్న కొన్నేళ్ల తర్వాత 20 శాతం నష్టానికి అమ్ముకోవడం విచిత్రంగా అనిపిస్తోంది. ఫ్లాట్ రేటు ఎందుకు పడిపోయిందన్నది పక్కన పెడితే.. ఇలా నష్టానికి అత్యవసరంగా అర్జున్ ఎందుకు దాన్ని అమ్మేశాడు అన్నది చర్చనీయాంశంగా మారింది. అతడికి ఆర్థికంగా అంత పెద్ద అవసరాలేమీ లేకపోవచ్చు.
మలైకాతో అతడికి చెడిందని.. అందుకే తనకు దగ్గరగా ఉండొద్దన్న ఉద్దేశంతోనే అతను ఫ్లాట్ అమ్మేశాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. అర్జున్‌తో మలైకాల బంధమే అసహజం అని.. ఎప్పటికైనా ఇలా అవ్వాల్సిందే అంటూ నెటిజన్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలుపెట్టేశారు. మరి నిజంగానే ఈ జంట విడిపోనుందా.. లేక ఫ్లాట్ అమ్మకానికి వేరే కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on July 22, 2022 7:39 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…