రెండు వారాల నుంచి పబ్లిసిటీతో హోరెత్తిస్తున్న లైగర్ ట్రైలర్ ని ఇవాళ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో భారీ జన సందోహం మధ్య విడుదల చేశారు. నిన్నే ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ అండర్ వేర్ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం దాని మీద రకరకాల ట్రోల్స్ మీమ్స్ రావడం కోరుకున్న ప్రచారం కంటే ఎక్కువే తెచ్చి పెట్టింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్, డియర్ కామ్రేడ్-వరల్డ్ ఫేమస్ లవర్ వైఫల్యాల తర్వాత రౌడీ హీరో చేసిన మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు.
ఇక ట్రైలర్ సంగతి చూస్తే ఎప్పటిలాగే పూరి తన మార్కుని కొనసాగించారు. కథ మరీ ఊహించనిది అనిపించలేదు కానీ క్యారెక్టర్ల పరంగా ఇచ్చిన ట్విస్టులు మాత్రం కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా తల్లి పాత్ర పోషించిన రమ్యకృష్ణని ఊరమాస్ గా చూపించేశారు. పులికి సింహానికి క్రాస్ బ్రీడ్ నా కొడుకు అంటూ ఆవిడ డైలాగ్ తోనే వీడియో మొదలయ్యింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ రిచ్ గా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండకు నత్తి పెట్టేశారు. ఇటీవలే ఎఫ్3లో వరుణ్ తేజ్ దీన్ని కామెడీ స్లాంగ్ తో చేయగా లైగర్ లో మాత్రం సీరియస్ టచ్ ఉంది.
మొత్తానికి ఫ్యాన్స్ కోరుకున్నట్టే యాక్షన్ మసాలాతో లైగర్ ని నింపేశారు. హీరోయిన్ అనన్య పాండేని కొన్ని సీన్లలో అలా చూపించి వదిలేశారు. మైక్ టైసన్ విజువల్స్ కూడా రివీల్ చేశారు. మొన్నటి దాకా సంగీత దర్శకుడి పేరు విషయంలో సస్పెన్స్ కొనసాగింది కానీ టైటిల్ కార్డు చివరిలో బ్యాక్ గ్రౌండ్ కోర్ సునీల్ కశ్యప్ అని చెప్పేశారు. మ్యూజిక్ సూపర్ వైజర్ గా అజీమ్ దయాని పేరు ఉంది. అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయికి ఇంటర్నేషనల్ వెర్షన్ గా ఈ లైగర్ ని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ 25 అయిదు భాషల్లో విడుదల చేయనున్నారు
This post was last modified on July 21, 2022 10:32 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…