Movie News

కొరటాల సినిమా వెనక్కి?

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కొరటాల శివతోనే అన్న సంగతి తెలిసిందే. నిజానికి ముందు త్రివిక్రమ్‌తో సినిమా అనుకున్నప్పటికీ.. ఏవో కారణాల వల్ల అది క్యాన్సిలైంది. దాని స్థానంలో కొరటాల సినిమా వచ్చింది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసి తారక్ ఎప్పుడో అందుబాటులో వచ్చినప్పటికీ.. ‘ఆచార్య’ బాగా ఆలస్యం కావడంతో కొరటాల ఫ్రీ అవ్వడానికి టైం పట్టింది. అయినా సరే తారక్ ఓపిగ్గా ఎదురు చూస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఏప్రిల్ నెలాఖర్లో ‘ఆచార్య’ రిలీజైపోవడంతో తారక్ సినిమాను కొరటాల మొదలు పెట్టడానికి లైన్ క్లియర్ అయినట్లే అనుకున్నారంతా.

జూన్‌లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ తీరా చూస్తే జూన్ వచ్చింది. వెళ్లింది. ఇప్పుడు జులై కూడా పూర్తి కావస్తోంది. కానీ సినిమా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. కొరటాల ఫెయిల్యూర్లో ఉన్నాడని తారక్ వెనక్కి తగ్గే టైపు అయితే కాదు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్‌తో ధైర్యగా సినిమా చేశాడు. ‘అరవింద సమేత’తో మంచి ఫలితాన్నందుకున్నాడు.

ఇలాగే కొరటాలతోనూ మ్యాజిక్ జరుగుతుందని అనుకుంటే.. ఈ సినిమా ఇప్పుడు వెనక్కి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. అలా అని కొరటాల మీద అనుమానంతో తారక్ ఏమీ ఆ సినిమా ఆపేయట్లేదట. ఈ సినిమా స్క్రిప్టు విషయంలో పూర్తి సంతృప్తి చెందకపోవడం, ‘ఆచార్య’ సెటిల్మెంట్ గొడవల వల్ల కొరటాల అనుకున్న సమయానికి బౌండ్ స్క్రిప్టు రెడీ చేయలేకపోవడంతో ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేద్దామన్న ఆలోచనలో తారక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తనకు చాలా గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఇంకా ఎక్కువ రోజులు ఆగే పరిస్థితి లేదని, బుచ్చిబాబు సానా తన కోసం పక్కాగా కథ రెడీ చేసి ఉండడంతో ఆ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదికి తీసుకెళ్లిపోదామని తారక్ చూస్తున్నట్లు సమాచారం.

ఈ విషయంలో కొరటాల హర్ట్ కాకుండా వ్యవహారాన్ని డీల్ చేయాలని చూస్తున్నాడని.. ఏ ప్రెజర్ లేకుండా ప్రశాంతంగా స్క్రిప్టు రెడీ చేసుకోమని, బుచ్చిబాబు సినిమా అవ్వగానే కొరటాల సినిమానే చేస్తానని మాట ఇచ్చి ముందుకెళ్లబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు హడావుడి పడుతూ తన గురువు సుకుమార్‌ను కలిసి ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమా స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నాడని.. సుకుమార్ కూడా ‘పుష్ప-2’ పని పక్కన పెట్టి శిష్యుడికి సాయం చేస్తున్నాడని.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయని తెలిసింది.

This post was last modified on July 20, 2022 4:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

27 minutes ago

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

3 hours ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

4 hours ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

5 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

6 hours ago

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…

6 hours ago