ఛలోని ఏ ముహూర్తంలో ఒప్పుకుందో కానీ అప్పటి నుంచి రష్మిక మందన్న జాతకమే మారిపోయింది. అక్కడిదాకా ఓ మోస్తరు అవకాశాలతో శాండల్ వుడ్ లో నెట్టుకొస్తున్న తనకు ఏకంగా ఇక్కడ రెడ్ కార్పెట్ దక్కింది. ఆ తర్వాత గీత గోవిందంతో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. దేవదాస్, డియర్ కామ్రేడ్ లు వరసగా ఫ్లాప్ అయినా వాటి ప్రభావం కెరీర్ మీద పడలేదు. సరిలేరు నీకెవ్వరు, భీష్మలు సూపర్ హిట్ కావడంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇక పుష్పతో జరిగిన మేలు ఎంతో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు తన చేతిలో హిందీ తెలుగు తమిళంలో మంచి ఆఫర్లున్నాయి. బాలీవుడ్ లో చేస్తున్న మిషన్ మజ్ను, గుడ్ బైలు పూర్తయ్యే స్టేజి లో ఉండగా టైగర్ శ్రోఫ్ కు మరో కొత్త ప్రాజెక్టులో జోడిగా నటించడం దాదాపుగా లాక్ అయినట్టే. రన్బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో చేస్తున్న అనిమల్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకంతో ఉంది. ఇవి కాకుండా విజయ్ వారసుడులో ఛాన్స్ కొట్టేయడం తమిళనేల మీద జెండా పాతేందుకు అవకాశం ఇచ్చినట్టే. పుష్ప 2 ది రూల్ ఎలాగూ చేతిలో ఉంది.
ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చియాన్ విక్రమ్ తో ఓ సినిమాకు రష్మిక సైన్ చేయబోతోందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆయన వయసు 56 ఏళ్ళు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ బ్యూటీస్ విక్రమ్ సరసన నటించడం లేదు. కోబ్రాలో చేసిన కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా అది ఎప్పుడో ఒప్పుకున్న ప్రాజెక్ట్. అందులో పాత్ర తీరుతెన్నులు ఇంకా తెలియదు. మరి ఇంత ఫామ్ లో ఉన్న రష్మిక విక్రమ్ జోడి అంటే మిస్ మ్యాచ్ అవుతుందేమోననే అనుమానం రాకపోదు. లేదూ తను చేస్తోంది వేరే క్యారెక్టరా అనేది తెలిశాక దీని గురించి క్లారిటీ రావొచ్చు. చూద్దాం
This post was last modified on July 19, 2022 10:16 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…