చైతు ప్లేస్ లో రానా… ఆ రీమేక్ ఫిక్స్ !

కోలీవుడ్ లో శింబుతో వెంకట్ ప్రభు తీసిన ‘మానాడు’ పెద్ద హిట్టయింది. వెంటనే తెలుగు రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడ్డారు. ఫైనల్ గా నిర్మాత సురేష్ బాబు రైట్స్ దక్కించుకున్నారు. సురేష్ ప్రొడక్షన్ లో చైతన్య హీరోగా చేయాలనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. దీంతో వెంకట్ ప్రభు చైతు కోసం ఇంకో కథ రాసి తెలుగులో సినిమా చేస్తున్నాడు.

ఆ తర్వాత ‘మానాడు’ రీమేక్ గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా నాగ చైతన్య ని మీడియా ఆ రీమేక్ గురించి అడగ్గా అసలు మేటర్ రివీల్ చేసేసాడు చైతు. ఆ సినిమా చూశాను నాకు బాగా నచ్చింది. మానాడు కంటే ముందే నేను, విక్రమ్ ప్రభు సినిమా కోసం ట్రావెల్ అవుతున్నాం. ఆ రీమేక్ చేయాలనుకున్నాను. కానీ సెట్ అవ్వలేదు. ఇప్పుడు రానా ఆ సినిమా చేస్తున్నాడు. దర్శకుడు ఫైనల్ అవ్వలేదు అంటూ అసలు విషయం చెప్పేశాడు చైతు.

అలాగే నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి కూడా తెలిపాడు. పరశురాం నేను ఈ మధ్యే వారం క్రితం కలిసాం. కథతో మళ్లీ కలుస్తానన్నాడు. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు ఐడియా మాత్రమే చెప్పాడు. అలాగే తరుణ్ భాస్కర్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది ఆ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ లోనే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.