తమిళంలో స్టార్ హీరోగా వెలుగుతూ మనదగ్గరా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న సూర్య ఇప్పటిదాకా స్ట్రెయిట్ తెలుగు సినిమా ఏదీ చేయలేదు. కొన్నింటికి స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడే తప్ప ఎప్పుడూ డైరెక్ట్ మూవీ చేసే అవకాశం రాలేదు. మధ్యలో ఒకరిద్దరు ట్రై చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు తన మొదటి అడుగు టాలీవుడ్ లో పెట్టబోతున్నాడు. సిరుతై శివ దర్శకత్వంలో యువి సంస్థ దీన్ని తెరకెక్కించబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ ప్రాజెక్ట్ దాదాపుగా లాక్ అయినట్టే
అజిత్ తో వరసబెట్టి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడిగా శివకు కోలీవుడ్ లో పెద్ద ఇమేజ్ ఉంది. రొట్ట రొటీన్ కథలను తీస్తాడనే విమర్శ ఉన్నప్పటికీ తలా ఇమేజ్ పుణ్యమాని అక్కడో బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. అయితే గత ఏడాది రజనీకాంత్ పెద్దన్న రూపంలో పెద్ద షాకే తిన్నాడు. మరీ పాతకాలం టేకింగ్ తో ప్రేక్షకుల సహనంతో ఆడుకుని రజని ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. అయినా కూడా సూర్య అదేమీ పట్టించుకోకుండా శివ చెప్పిన లైన్ నచ్చడంతో ఓకే అన్నారని తెలిసింది.
శివకు తెలుగు సినిమాలు చేసిన అనుభవం ముందే ఉంది. గోపిచంద్ తో 2008 టైంలో వరసగా శౌర్యం, శంఖం తీశారు. ఓ మోస్తరుగా ఆడాయి. రవితేజ దరువు పెద్ద ఫ్లాపు. విక్రమార్కుడుని కార్తీతో సిరుతైగా రీమేక్ చేసి హిట్టు కొట్టాకే దశ తిరిగింది. సో సూర్యతో టై అప్ అంటే మరోసారి కమర్షియల్ మూవీ నే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. గత కొన్నేళ్లుగా ఇక్కడ చెప్పుకోదగ్గ హిట్టు లేని సూర్యకు ఇటీవలే ఈటి ఫలితం కూడా నిరాశపరిచింది. ఆకాశం నీ హద్దురా, జైభీంలు ఓటిటి రిలీజైనప్పటికీ మంచి ఆదరణ దక్కడం తన ఇమేజ్ ని కాపాడింది
This post was last modified on July 18, 2022 9:59 pm
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…