స్పోర్ట్స్ బయోపిక్.. ఒకప్పుడు బాలీవుడ్‌కు కాసులు పండించిన జానర్ ఇది. చక్ దే ఇండియా, పాన్ సింగ్ తోమర్, బాగ్ మిల్కా బాగ్ లాంటి సినిమాలు సూపర్ హిట్లవడం.. ఆపై ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ, దంగల్, బ్లాక్‌బస్టర్లు కావడంతో ఇక అందరూ ఆ జానర్ మీద పడిపోయారు.
కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. కాస్త పేరున్న ప్రతి స్పోర్ట్స్ పర్సన్ మీదా సినిమాలు తీయడం మొదలుపెట్టడం.. జనాల ఎమోషన్ పట్టించుకోకుండా ఎగ్జాజరేషన్లతో సినిమాలు తీయడంతో ఈ జానర్ చాలా త్వరగా మొహం మొత్తేసింది.
మేరీకోమ్, సైనా, 83 లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇందులో 83 చాలా మంచి సినిమా అయినా సరే ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ జానర్ జనాలకు ఇప్పుడు రుచించట్లేదన్నది స్పష్టం. అయినా సరే..బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్స్ ఆగట్లేదు. తాజాగా ఈ జానర్లో మరో సినిమా తుస్సుమనిపించింది. అదే.. శభాష్ మిథూ.
దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తాప్సి ప్రధాన పాత్రలో శ్రీజిత్ ముఖర్జీ రూపొందించిన సినిమా.. శభాష్ మిథూ. వయాకామ్ స్టూడియోస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. తాప్సి, మిథాలీ కలిసి ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేశారు. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. కానీ ఏం లాభం? తొలి రోజు కేవలం రూ.40 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టిందీ చిత్రం.
తాప్సికి ఉన్న ఇమేజ్‌కు ఈ వసూళ్లు మరీ దారుణం. ఇంతకుముందు సైనా సినిమాకు రూ.50 లక్షల వసూళ్లే రాగా.. అప్పుడే ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోయారు. దాంతో పోలిస్తే శభాష్ మిథూ ట్రైలర్ బాగున్నా, తాప్సి లాంటి స్టార్ నటించినా.. ఈ సినిమాకు ఇంకా తక్కువ కలెక్షన్లు రావడం పెద్ద షాకే. దీన్ని బట్టి స్పోర్ట్స్ బయోపిక్స్ అంటే జనాలకు మొహం మొత్తేసిందని, పైగా మనకు అన్నీ తెలిసిన ప్రెజెంట్ ప్లేయర్స్ జీవితాల మీద సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదని స్పష్టమైంది. కాబట్టి ఇకపై ఈ జానర్లో సినిమాలకు బ్రేక్ ఇస్తే బెటరేమో.
This post was last modified on July 17, 2022 9:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…