లైగర్ కు ఇదొక్కటే చిక్కు

విక్రమ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద జోష్ తగ్గిపోయిన తరుణంలో తిరిగి దాన్ని తీసుకొచ్చే సినిమా కోసం ట్రేడ్ వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. భారీ అంచనాలు పెట్టుకున్న ది వారియర్ సోసోగా ఆడగా థాంక్ యుతో పాటు రామారావు ఆన్ డ్యూటీల మీద జూలై నెల ఆశలన్నీ మిగిలున్నాయి. ఇవన్నీ తెలుగు మార్కెట్ ని మాత్రమే టార్గెట్ చేసుకున్నవి. ప్యాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ ఒకే బజ్ తెచ్చుకోగల కెపాసిటీ ఉన్న సినిమా మాత్రం రాబోయే నెలన్నరలో లైగర్ ఒక్కటే. దానికి తగ్గట్టే ప్రమోషన్లు గట్రా చేస్తున్నారు

ఇదంతా బాగానే ఉంది కానీ లైగర్ లో చాలా కీలకంగా చెప్పుకుంటున్న మైక్ టైసన్ పాత్ర తాలూకు ట్విస్టు ఒకటి లీకు రూపంలో తిరుగుతోంది. అది నిజమైతే మాత్రం ప్రేక్షకుల కోణంలో దాన్ని బలంగా రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత దర్శకుడు పూరి జగన్నాధ్ మీద ఉంది. దాని ప్రకారం మైక్ టైసన్ ని బాక్సింగ్ రింగ్ లో ఓడించి అతనితో సెల్ఫీ తీసుకోవాలనే గోల్ తో లైగర్ ఉంటాడట. అందుకోసం ప్రాణాలు రిస్క్ లో పెట్టేందుకైనా వెనుకాడడు. చివరికి అడ్డంకులు దాటుకుని అమెరికా వెళ్లి మరీ తన లక్ష్యాన్ని సాధించుకోవడమే కథట.

సరే లైన్ సంగతి ఎలా ఉన్నా మైక్ టైసన్ కొన్నేళ్ల క్రితం బాక్సింగ్ కింగ్ కానీ ఇప్పుడు కాదు. ఒకవేళ లైగర్ స్టోరీని ఇప్పుడు జరిగినట్టు చూపిస్తే మాత్రం ఈ పాయింట్ అంతగా సింక్ అవ్వకపోవచ్చు. లేదూ ఓ పది ఇరవై ఏళ్ళ క్రితం జరిగినట్టు చూపిస్తారా అంటే అది కన్విన్స్ అయ్యేలా ఉండొచ్చు. ఏది ఏమైనా బాక్సింగ్ కు అంతగా ఆదరణ లేని మన దేశంలో ఈ కాన్సెప్ట్ తో కోట్ల బడ్జెట్ తో అందులోనూ టైసన్ లాంటి రిటైర్డ్ దిగ్గజంతో ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తారో చూడాలి. ఆగస్ట్ 25 విడుదల కాబోతున్న లైగర్ ట్రైలర్ ఈ 21న వస్తోంది