టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు తన శిష్యుల్ని వృద్ధిలోకి తేవాలని మహా తపన. తన దగ్గర అసిస్టెంట్లుగా పని చేసిన అందరినీ దర్శకులు అవ్వాలని ఆయన గట్టిగా కోరుకుంటారని సన్నిహితులు చెబుతారు. ఇప్పటికే సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడయ్యాడు. రెండు సినిమాలు తీశాడు. అందులో కుమారి 21 ఎఫ్ బ్లాక్‌బస్టర్ అయింది. దీని తర్వాత 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే సుకుమార్ స్నేహితులు, అతడి సినిమాలకు పని చేసిన హరిప్రసాద్ జక్కా, వేమారెడ్డి సైతం దర్శకులుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ వరుసలో బుచ్చిబాబు సానా కూడా దర్శకుడిగా మారాడు. సుక్కు ప్రియ శిష్యుల్లో ఒకడైన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే లాక్ డౌన్ వల్ల ఉప్పెన ఆలస్యమైంది కానీ.. లేకుంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే. ఈ విషయంలో బుచ్చిబాబు చాలా ఫీలవుతున్నప్పటికీ.. అతడికి ఉపశమనాన్నిచ్చే పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. అతడితో సినిమా చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓకే అన్నట్లు తెలిసింది.
ఒక పెద్ద స్థాయి కమర్షియల్ కథను తయారు చేసుకెళ్లి సుకుమార్ రెకమండేషన్‌తో చరణ్‌ను కలిసి అతడికి కథ చెప్పగా.. చరణ్‌కు బాగా నచ్చిందట. ఇప్పటికే ఉప్పెన సినిమా చూసి ఇంప్రెస్ అయిన చరణ్.. వీలు చూసుకుని ఈ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. సుకుమార్ కూడా తన శిష్యుడి గురించి భరోసా ఇవ్వడం, అవసరమైతే స్క్రిప్టు, మేకింగ్‌లో తన సహకారం ఉంటుందని హామీ ఇవ్వడంతో చరణ్ భవిష్యత్తులో బుచ్చిబాబుతో పని చేయడానికి ఓకే అన్నట్లు సమాచారం.
This post was last modified on July 1, 2020 9:08 am
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…