‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ తో సినిమా అంటే ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఇక ఈ దర్శకులకి తిరుగే లేదంటూ ఆడియన్స్ మాట్లాడుకుంటారు. సరిగ్గా సుజీత్ , రాదాకృష్ణ విషయంలో ఇదే జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇద్దరికీ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్. ఇద్దరూ చేసింది ఒకే సినిమా అయినప్పటికీ ప్రభాస్ హీరో కాబట్టి యూవీ సంస్థ భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేతిలో పెట్టింది. నిజానికి ప్రభాస్ దగ్గరికి ఈ ఇద్దరినీ చేర్చింది యూవీ నిర్మాతలే అనుకోండి. కానీ ప్రభాస్ ఈ దర్శకులను నమ్మి సినిమా ఇవ్వడం గొప్ప విషయమే.
‘సాహో’ తర్వాత సుజీత్ , ‘రాధేశ్యామ్’ తర్వాత రాధాకృష్ణ ఎవరికీ దొరకకుండా డైరెక్టర్స్ గా బిజీ అయిపోతారని అనుకున్నారంత. కానీ అన్ని అనుకున్నట్లు జరిగితే మనం డెస్టినీని ఎందుకు గుర్తుచేసుకుంటాం అందుకే సుజీత్ , రాదా కృష్ణ కి కెరీర్ కి ఊహించని బ్రేక్ పడింది. ప్రభాస్ కి చెరో ఫ్లాప్ అందించి నమ్మకాన్ని వొమ్ము చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఇద్దరికీ నెక్స్ట్ సినిమా ఏంటో తెలియని పరిస్థితి.
సుజీత్ ‘సాహో’ తర్వాత మెగాస్టార్ తో ‘లూసిఫర్’ రీమేక్ చేయాల్సింది. కానీ చివరి క్షణంలో ప్రాజెక్ట్ మిస్ అయ్యింది. కారణం ఏదైనా అందులో సాహో రిజల్ట్ కూడా ఉండొచ్చు. అప్పటి నుండి ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ లేదు. డివీవీ బేనర్ లో ఓ సినిమా అంటూ కొన్ని నెలలుగా వార్త చక్కర్లు కొడుతుంది ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు.
ఇక రాధాకృష్ణ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ డైరెక్టర్ కి ఎవరూ అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని టాక్. అందుకే ప్రస్తుతం ఏదో స్క్రిప్ట్ రెడీ చేస్తూ మళ్ళీ యూవీ లోనే ఏదైనా చిన్న సినిమా చేయాలనుకుంటున్నాడని తెలుస్తుంది. ఏదేమైనా ఎవరూ ఊహించని విధంగా ఈ ఇద్దరూ రెండో సినిమాకి ప్రభాస్ లాంటి స్టార్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లి అంతే స్పీడుగా కింద పడ్డారు. మరి ప్రభాస్ దర్శకులు మూడో సినిమాతో మళ్ళీ తమ టాలెంట్ నిరూపించుకుంటే అవకాశాలు అందుకొని డైరెక్టర్స్ గా బిజీ అవ్వొచ్చు.
This post was last modified on July 13, 2022 4:52 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…