మాములుగా బ్లాక్ బస్టర్ సినిమాను త్రీడిలో మార్చడం చూశాం. అలా చేస్తే అభిమానుల్లోనూ ఆసక్తి కలుగుతుంది. బాహుబలినో, అమ్మోరునో ఆ ఎఫెక్ట్స్ తో చూస్తే వచ్చే కిక్కే వేరు. ఆ మధ్య రజనీకాంత్ శివాజీని ఈ టైపులో మార్చారు కానీ అదేమంత ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హిందీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ షోలేని ఈ మోడల్ లో చూసే అదృష్టానికి నార్త్ ఆడియన్స్ నోచుకున్నారు. హాలీవుడ్ లో ఇది నిత్యం జరిగేదే. ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన జురాసిక్ పార్క్ ని త్రీడికి మార్చినప్పుడు ప్రేక్షకులు పొందిన అనుభూతి మాటల్లో చెప్పేది కాదు.
కానీ ఒక ఫ్లాప్ మూవీకి ఈ టెక్నాలజీ అప్లై చేయడమంటే విచిత్రమే. 2001లో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేసిన ఆలవందాన్ తమిళంలోనే ఓ మోస్తరుగా ఆడింది. తెలుగులో అభయ్ పేరుతో డబ్బింగ్ చేస్తే ఇక్కడ దారుణమైన డిజాస్టర్. భారతీయుడు, భామనే సత్యభామనే లాంటి అద్భుతమైన పాత్రల్లో కమల్ ని చూసిన ప్రేక్షకులు సైకోగా లోకనాయకుడిని రిసీవ్ చేసుకోలేకపోయారు. దర్శకుడు సురేష్ కృష్ణ తీర్చిదిద్దిన తీరు టెక్నికల్ గా పేరు తెచ్చినప్పటికీ కమర్షియల్ గా అభయ్ ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే పరిగణిస్తారు.
ఇప్పుడీ మూవీని 3Dలోకి కన్వర్ట్ చేసి నవంబర్ 7న కమల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారట. ఇందులో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ అవి ఇంత సాంకేతికతను డిమాండ్ చేసేవి కాదు. దీనిలో స్పెషల్ ఎఫెక్ట్స్ కు జాతీయ అవార్డు లభించింది కానీ ఇప్పటి జనరేషన్ కు అంత కిక్ ఇచ్చే కంటెంట్ ఉందని చెప్పలేం. అభయ్ ఒరిజినల్ వెర్షన్ కు కథ మాటలు స్క్రీన్ ప్లే అన్నీ సమకూర్చింది కమలే. 2019లో హేరామ్ ని రీ మాస్టర్ చేసి రిలీజ్ చేశాక ఇప్పుడిది రెండో సినిమా అవుతుంది.
This post was last modified on July 13, 2022 2:17 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…