వారియర్ …నాలుగు వారాల్లోనే..?

టాలీవుడ్ లో ఇటీవల డిసైడ్ చేసిన నిర్ణయం ఒకటి వుంది. ఏ పెద్ద సినిమా అయినా ఎనిమిది వారాల్లోగా ఓటిటికి ఇవ్వకూడదు. మిగిలిన సినిమాలు నాలుగు వారాల వరకు ఓటిటికి ఇవ్వకూడదు. అదీ నిర్ణయం. కానీ ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తయిన సినిమాల విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదు. అందుకే ఇప్పటికెే అగ్రిమెంట్లు పూర్తయిన సినిమాలు ఆ అగ్రిమెంట్లను గిల్డ్ కు అందించాలని కోరారు.

ఇలాంటి నేపథ్యంలో వస్తున్న ది వారియర్ సినిమా చాలా త్వరలోనే ఓటిటిలో ప్రత్యక్షం అవుతుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇవి ఎంత వరకు నిజం అన్నది క్లారిటీ లేదు కానీ ఈ వార్తలు విని బయ్యర్లు కలవరపడుతున్నట్లు బోగట్టా. ఎందుకంటే ఈ సినిమాను 30 కోట్ల మేరకు థియేటర్ మార్కెట్ చేసారు. ఇంత అమౌంట్ రికవరీ కావాలంటే సినిమా పెద్ద హిట్ కావడమే ముఖ్యం కాదు. నాలుగు వారాల పాటు రన్ కూడా వుండాలి. మేజర్ సెంటర్లలో పెద్ద సినిమాలు అన్నీ నాలుగు వారాలు సులువుగా ఆడతాయి. ఎంత టాక్ బాగా లేకున్నా కూడా ఎక్కడో ఓ థియేటర్ లో రన్ చేస్తూనే వుంటారు.

అలాంటిది నాలుగు వారాల్లో ఓటిటికి వస్తే మాత్రం కష్టం అవుతుంది. వారియర్ సినిమా మీద మంచి బజ్ వుంది హొప్ వుంది. అందువల్ల ఈ సినిమా ఓటిటికి అంత త్వరగా రాదనే ఆశిద్దాం. అలా అయితేనే నిర్మాతలు బాగుంటారు. బయ్యర్లు బాగుంటారు.