మాములుగా ఇప్పుడున్న స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ అయ్యేలా చూసుకుంటేనే అదో పెద్ద ఘనతగా చెప్పుకునే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్లు సంవత్సరానికి పధ్నాలుగు ఎలా చేశారో ఆ దేవుడికే తెలియాలి. నాని నితిన్ టైపు మీడియం రేంజ్ బ్యాచ్ తప్ప అందరూ ఇయర్లీ వన్ పద్దతిని ఫాలో అవుతున్నారు. అనుకోకుండా ఈ ఏడాది రామ్ చరణ్ వి కేవలం 35 రోజుల గ్యాప్ లో ఆర్ఆర్ఆర్, ఆచార్య వచ్చాయి. అది కూడా కరోనా లాంటి రకరకాల కారణాలు వెనుక ఉన్నాయి లెండి.
ఇక చైతు విషయానికి వస్తే ఇరవై రోజుల వ్యవధిలో తనవి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో మొదటిది 22న రాబోతున్న థాంక్ యు. దిల్ రాజు నిర్మాతగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి ఇంకా చెప్పుకోదగ్గ బజ్ రాలేదు. ప్రమోషన్లు మెల్లగా మొదలుపెట్టారు కానీ లవ్ స్టోరీ, బంగార్రాజు టైంలో ఉన్నంత హడావిడి కనిపించడం లేదు. చేతిలో ఇంకో పది రోజులు మాత్రమే ఉంది కాబట్టి పబ్లిసిటీని ఇంకాస్త స్పీడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది.
రెండోది ఆగస్ట్ 11న రాబోతున్న లాల్ సింగ్ చడ్డా. అమీర్ ఖాన్ హీరో అయినప్పటికీ ఇందులో చైతుకి ప్రాధాన్యం కలిగిన పాత్రే ఇచ్చారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బజ్ రావడానికి ఇదీ ఒక కారణమవుతుంది.ఎందుకో తెలియదు కానీ లాల్ సింగ్ మీద ఏమంత హైప్ లేదు. అమీర్ మూవీ వస్తుందన్నంత హంగామా బిల్డ్ కావడం లేదు. ఫారెస్ట్ గంప్ రీమేక్ అవ్వడం కొంత ఎఫెక్ట్ ఇస్తున్నా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసేంత కంటెంట్ ఉందనే నమ్మకం కలిగించాలి. మొత్తానికి తక్కువ గ్యాప్ లో చైతు రెండు సినిమాలు వస్తున్న ఆనందం ఒకవైపు, రెండూ మాస్ జానర్ కాకపోవడం మరోవైపు అక్కినేని ఫ్యాన్స్ ని కొంత టెన్షన్ కు గురి చేస్తున్నాయి,
This post was last modified on July 12, 2022 3:00 pm
వైసీపీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…
భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…
పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…