‘మంచు’ కి హిట్ పడాల్సిందే

మంచు విష్ణు హీరోగా ‘జిన్నా’ అనే సినిమా తెరకెక్కుతుంది. కోనా వెంకట్ కథ-స్క్రీన్ ప్లే తో ఈశాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజైంది. విష్ణుని హీరో అంటే పలకకుండా కేవలం జిన్నా అని పిలిస్తేనే కెమెరా ముందుకు వస్తాడన్నట్టుగా ఏదో ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అందులో గోడపై నుండి విష్ణు జంప్ చేస్తూ ఫ్రీజ్ చేసి ఫస్ట్ లుక్ వదిలారు. ఈ వీడియో ఎలా ఉంది అన్నది పక్కన పెడితే విష్ణు వైట్ అండ్ వైట్ లో ఒకప్పటి ‘డీ’ సినిమాను గుర్తుతెచ్చాడు.

అయితే విష్ణుకి ఈ మూవీ కీలకమనే చెప్పాలి. చాలా కాలం తర్వాత తన దగ్గరికి ఓ పూర్తి స్థాయి ఎంటర్టైన్ మెంట్ మిక్స్డ్ కమర్షియల్ సినిమా వచ్చిందని మంచు హీరో స్టోరీకి ఫిదా అయిపోయి భారీ బడ్జెట్ పెడుతున్నాడు. టాప్ టెక్నీషియన్స్ ని తీసుకున్నాడు. ఇద్దరు హీరోయిన్స్ కి మంచి రెమ్యునరేషన్ ఇచ్చాడు. ఇదంతా తనకి వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెడుతున్నట్లు భావిస్తున్నాడు విష్ణు.

నిజానికి మంచు ఫ్యామిలీ నుండి ఓ హిట్ సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. తాజాగా వచ్చిన మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ డిజాస్టర్ అనిపించుకుంది. తొలి రోజు కూడా మోస్తారు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో విష్ణు ఇప్పుడు జిన్నా తో హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పటిలా విష్ణు థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలిగితే హిట్ కొట్టడం ఖాయం. గ్లామరస్ హీరోయిన్స్ , సీనియర్ రైటర్ , చోటా విజువల్స్, అనూప్ మ్యూజిక్ ఇలా సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. మరి జిన్నా తో విష్ణు ఎలాంటి హిట్ కొడతాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.