తెలుగు రాష్ట్రాలు వర్షంలో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ గురించి చెప్పనక్కర్లేదు. సిఎం కెసిఆర్ నిన్న జరిపిన ప్రెస్ మీట్ లో ప్రత్యేకంగా స్కూళ్లకు కాలేజీలకు మూడు రోజులు సెలవులు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ తో పాటు చాలా ఊళ్లలో రోడ్లు జలపాతమయ్యాయి.
ఎప్పుడు చినుకు కురిసి దారిలో ఇరుక్కుపోతామోనని వృత్తి కోసమో లేదా ఏదైనా పని ఉంటే తప్ప జనం తాపీగా బయటికి రాలేని ఇరకాటం వచ్చి పడింది. ఇప్పుడిదంతా టాలీవుడ్ గుండెల్లో గుబులు రేపుతోంది.
ఈ వారం రామ్ కొత్త సినిమా ది వారియర్ భారీ ఎత్తున విడుదల కాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర జోష్ బాగా తగ్గిపోయిన తరుణంలో ట్రేడ్ దీని మీద చాలా నమ్మకం పెట్టుకుంది. తీరా చూస్తే ఇప్పుడు వరుణ దేవుడు షాక్ ఇస్తున్నాడు.
ఎంత వర్షం వచ్చినా పర్లేదు సినిమాలు చూసే తీరాలనే మైండ్ సెట్ లో ఇప్పటి పబ్లిక్ లేరు. పైగా టాక్ తెలిసి అబ్బో బ్రహ్మాండంగా ఉందంటే తప్ప మాములు రోజుల్లో హాలు దాకా వెళ్లడం లేదు. అలాంటిది దారుల్లో నీళ్లు పారుతుంటే కార్లు బండ్లు వేసుకుని సాహసం చేసే సీన్ ఉంటుందా.
ఇంకో రెండు మూడు రోజుల్లో వర్షం పూర్తిగా తగ్గిందా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదూ ఇంకో పది రోజులు ఇలాగే కొనసాగితే మాత్రం వారియర్ తో పాటు వస్తున్న మరికొన్ని చిన్న సినిమాల ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇప్పటికే మొన్న శనివారం నుంచి చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
అలాంటిది ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కు ఇలాంటి సిచువేషన్ లో ఆకర్షించడం కష్టం. వారం తిరిగితే నాగచైతన్య థాంక్ యుతో పాటు బాలీవుడ్ మూవీ శంషేరాలు బరిలో దిగబోతున్నాయి. సో వాన దేవుడిని వీలైనంత త్వరగా నెమ్మదించమని కోరుకోవడం తప్ప ఇండస్ట్రీ వర్గాలు చేయగలిగింది ఏముంది
This post was last modified on July 12, 2022 2:51 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…