Movie News

మళ్లీ ప్రభాస్‌తో రానా?

‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. ఆ చిత్రంలో అతడి మ్యాన్లీ లుక్స్ చూసి బాలీవుడ్ వాళ్లు కూడా మెస్మరైజ్ అయిపోయారు. బాహుబలి అనే వాడు చేసిన విన్యాసాలు అతిగా అనిపించకుండా.. నిజంగా అతనో యోధుడు అనే భావన కలిగిందంటే అందుకు ప్రభాస్ లుక్స్, ఫిజిక్ కారణం.

ఐతే కథానాయకుడు ఎంతటి యోధుడిగా కనిపించినప్పటికీ.. అవతల ప్రతినాయకుడు కూడా బలంగా ఉంటేనే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. ‘బాహుబలి’లో హీరో పాత్ర అంతగా పండటానికి అవతల భల్లాలదేవుడిగా రానా దగ్గుబాటి దీటుగా నిలబడటం ముఖ్య కారణం. ఆ సినిమాతో రానా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రంలో ప్రభాస్-రానాల కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఈ సినిమా తర్వాత ఎవరి దారిలో వాళ్లు ప్రయత్నిస్తున్నారు ప్రభాస్, రానా. ఐతే ఈ ఇద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. అది.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రంలోనే అని వార్తలొస్తున్నాయి. ఐతే ఇందులో రానా చేయబోయేది పూర్తి స్థాయి పాత్ర కాదట. కేవలం రెండు మూడు నిమిషాల పాటు క్యామియో తరహా రోల్‌లో రానా కనిపిస్తాడట.

‘బాహుబలి’ అనుభవం దృష్ట్యా రానా ఇలాంటి క్యామియో చేస్తే ప్రభాస్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావించి అతణ్ని ఇందులో నటింపజేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయ్యాక రానా పాత్ర తాలూకు చిత్రీకరణ జరుపుతారట. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ వాళ్లతో కలిసి ప్రభాస్ పెదనాన్న సంస్థ ‘గోపీకృష్ణ మూవీస్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

This post was last modified on June 30, 2020 11:15 am

Share

Recent Posts

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

15 minutes ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

41 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

1 hour ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

2 hours ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

2 hours ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

2 hours ago