ఎదురుచూసే కొద్దీ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. కాంబోని ఆ మధ్య అధికారికంగా ప్రకటించారు కానీ ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి చప్పుడు లేదు. దర్శకుడు కొరటాల శివ ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేయడంలో విపరీతమైన జాప్యం చేస్తున్నారని ఫిలిం నగర్ ప్రచారం జోరుగా ఉంది. దాన్ని ఖండిస్తూ ఫలానా నెలలో ఫలానా తేదీకి స్టార్ట్ చేయబోతున్నామని ఏదో ఒకటి చెప్పినా సరిపోయేది. కానీ అలాంటిది జరిగే సూచనలు దగ్గరలో కనిపించడం లేదు.
ఒకవేళ ఆచార్య కనీసం యావరేజ్ అయినా కొరటాల శివ దీన్ని వేగంగా పరుగులు పెట్టించేవారు. చిరంజీవి నూటా యాభై సినిమాల కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ కావడం ఆయన జీర్ణించుకోలేనిది. ఎంతో నమ్మకస్తులైన తన టీమ్ లో కొందరు సభ్యులు స్క్రిప్ట్ దశలో జరుగుతున్న తప్పిదాలను కొంచెం కూడా పసిగట్టలేకపోవడం శివని బాగా డిస్ట్రబ్ చేసిందట. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా వాళ్లలో కొందరిని మార్చేసి కొత్తవాళ్లను కూర్చుకునే క్రమంలో ఇంత ఆలస్యం జరుగుతోందని సన్నిహిత వర్గాల లీక్.
ఇవన్నీ ఒక ఎత్తయితే హీరోయిన్ ఇప్పటికీ లాక్ కాకపోవడం మరో తలనెప్పి. అలియా భట్ ఒప్పుకున్నప్పుడు ఏ గొడవా లేదు. తీరా తను పెళ్లి గర్భం అంటూ డ్రాప్ అవ్వడంతో అసలు చిక్కు వచ్చి పడింది. రకరకాల ఆప్షన్లు చూస్తున్నారు కానీ ఏదీ కుదరడం లేదు. ఆల్రెడీ జూనియర్ తో చేసిన ఎవరినీ మళ్ళీ రిపీట్ చేయకూడదని కొరటాల ఆలోచనట. బాలీవుడ్ బ్యూటీని తీసుకుంటే ప్యాన్ ఇండియా ప్రమోషన్ కి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కోణంలోనే చూస్తున్నారు. కియారా అద్వానీ మంచి ఛాయసే కానీ తనేమో అందుబాటులో లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates