కరోనా తర్వాత మారిపోయిన పరిస్థితులను చూస్తుంటే ఏ సినిమా ఏ స్థాయిలో ఎంత రాబడుతుందో తలలు పండిన ట్రేడ్ విశ్లేషకులు సైతం ముందే చెప్పలేకపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్ళ తరబడి హిట్టు లేక సతమతవుతున్న కమల్ హాసన్ కనీసం పెట్టుబడైనా వెనక్కు తెస్తారాని అనుమాన పడితే అది ఏకంగా తమిళనాడు బాహుబలి 2 రికార్డుని బద్దలు కొట్టేసింది ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తినబెట్టుకుంటారని ఆశించిన అంటే సుందరం ఫైనల్ గా 9 కోట్లు నష్టం మిగిల్చింది.
కుక్కపిల్లను టైటిల్ రోల్ లో పెట్టి కేవలం ఎమోషన్ ని మెయిన్ ఎలిమెంట్ గా తీసుకున్న 777 ఛార్లీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని భాషలకు కలిపి 30 రోజులకు వరల్డ్ వైడ్ ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని దాటేసి ఔరా అనిపించేసింది. ఒక్క కన్నడ వెర్షన్ నుంచే 75 కోట్ల దాకా వసూలు కాగా తమిళనాడు 4 కోట్లు, తెలుగు రాష్ట్రాలు 4 కోట్లు, కేరళ 5 కోట్లు, మిగిలిన చోట్ల 5 కోట్ల 50 లక్షలు, ఓవర్సీస్ లో 7 కోట్ల 50 లక్షలు గ్రాస్ రాబట్టి నాన్ యాక్షన్ జానర్ లో శాండల్ వుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని తీసేసుకుని జెండా దాటింది.
ఇప్పుడు 777 ఛార్లీ అయిదో వారంలో ఉంది. దీంతో పాటు వచ్చినవి ముందు వెనుకా ఉన్నవి అన్నీ ఓటిటిలో వచ్చేశాయి. కానీ ఇది మాత్రం యాభై రోజుల టార్గెట్ పెట్టుకుని జూలై చివరి వారంలో డిజిటల్ ప్రీమియర్ ని లాక్ చేసుకుంది. ఇప్పటికీ చాలా సెంటర్స్ లో కొనసాగుతున్న ఈ పెట్ ఎంటర్ టైనర్ సక్సెస్ ఒకరకంగా పాఠమనే చెప్పాలి. థియేటర్లకు రావడానికి జనం మొండికేస్తున్న తరుణంలో కంటెంట్ కున్న ప్రాధాన్యత మరోసారి నొక్కి చెప్పినట్టు అయ్యింది. కర్ణాటక సిఎంతోనే కన్నీళ్లు పెట్టించిన రేంజ్ దీనిది.
This post was last modified on July 10, 2022 11:38 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…