నిన్నా మొన్నటి దాకా తెలుగులో అంతగా మార్కెట్ లేని శివ కార్తికేయన్ గత ఏడాది డాక్టర్ తో ఇక్కడ మొదటి హిట్ అందుకున్నాడు. దీనికన్నా ముందు సీమరాజా లాంటివి డబ్ అయినప్పటికీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇటీవలే వచ్చిన డాన్ కూడా సక్సెస్ కావడంతో తనకంటూ చెప్పుకోదగ్గ ఇమేజ్ వచ్చింది. దీంతో ఎలాగైనా టాలీవుడ్ లో జెండా పాతాలని నిర్ణయించుకున్న ఈ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం జాతరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ప్రిన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది.
ఇది సెట్స్ మీద ఉండగానే శివ కార్తికేయన్ మరో తెలుగు డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అతను కళ్యాణ కృష్ణ కురసాల. ఈ ఏడాది బంగార్రాజుతో డీసెంట్ హిట్ అందుకున్న ఇతగాడు నాగ్ మూవీ కోసం దాదాపు మూడేళ్ళ సమయం వెచ్చించాడు. అది నిర్మాణంలో ఉన్నప్పుడే శివ కార్తికేయన్ తో టచ్ లోకి వెళ్లడం, ఒక లైన్ నచ్చి దాన్ని ఫుల్ వెర్షన్ గా డెవలప్ చేసి ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టుగా వినికిడి. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చు.
తెలుగు మార్కెట్ సత్తాని కోలీవుడ్ హీరోలు మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. ధనుష్ ముందు లీడ్ తీసుకుని వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సర్ చేస్తుండగా నెక్స్ట్ ఈ శివ కార్తికేయన్ లైన్ లోకి వచ్చాడు. ఏనుగుని మనవాళ్ళు రిసీవ్ చేసుకోకపోయినా అరుణ్ విజయ్ ఇక్కడా ట్రై చేయడానికి ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఇలాంటి మీడియం రేంజ్ స్టార్లు తెలుగు దర్శకులను పట్టుకోవడం బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. రామ్ లాంటి వాళ్లేమో అక్కడి నుంచి లింగుస్వామిని తీసుకొచ్చి ది వారియర్ చేయడం గమనార్హం.
This post was last modified on July 7, 2022 5:15 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…