ఈ నెలలో మొదటి వారం గడిచిపోయింది. బోణీ చేసిన పక్కా కమర్షియల్ చేదు అనుభవం ఇవ్వడంతో నెక్స్ట్ అందరి చూపు రామ్ ది వారియర్ మీదే ఉంది. అంతకన్నా ముందు హ్యాపీ బర్త్ డే వస్తున్నప్పటికీ ఎలాంటి స్టార్ మెటీరియల్ లేని డిఫరెంట్ జానర్ మూవీ కావడంతో బుకింగ్స్ డల్ గా ఉన్నాయి. బజ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఓటిటి ట్రెండ్ లో బ్రహ్మాండమైన టాక్ వస్తే తప్ప ఇలాంటి వాటికి థియేటర్ డిమాండ్ రాదు. అందుకే జూలై 14న రాబోతున్న ఎనర్జిటిక్ స్టార్ మీద ట్రేడ్ భారీ నమ్మకంతో పెట్టుబడులు పెట్టేసింది.
ఇది కంప్లీట్ మాస్ బొమ్మ కాబట్టి యావరేజ్ టాక్ వచ్చినా చాలు వసూళ్లు బాగుంటాయి. కాకపోతే దర్శకుడు లింగుస్వామి ట్రాక్ రికార్డే కొంచెం టెన్షన్ పెడుతోంది. ఆ తర్వాత 22న నాగ చైతన్య థాంక్ యుతో పలకరించనున్నాడు. ఇది మజిలీ తరహా సాఫ్ట్ మూవీ అవ్వడం వల్ల యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చడం చాలా కీలకం. మనం తర్వాత చైతుతో విక్రమ్ కుమార్ చేస్తున్న మూవీ కావడంతో అంచనాల విషయంలో లోటేమీ లేదు కానీ ఇప్పటిదాకా ఎగ్జైటింగ్ గా అనిపించే ప్రమోషన్ మెటీరియల్ ఏదీ బయటికి రాలేదు.
ఇక మాస్ మహారాజా రవితేజ 29న రామారావు ఆన్ డ్యూటీతో బరిలో దిగబోతున్నాడు. దీని మీద ఇప్పటికే రకరకాల ప్రచారాలు. షూటింగ్ జాప్యం, ఆర్థిక ఇబ్బందులు, విభేదాలు అంటూ ఏవేవో. వీటి సంగతి ఎలా ఉన్నా దర్శకుడు శరత్ మండవ, వేణు తొట్టెంపూడిలతో ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశారు. క్రాక్ ఆనందాన్ని ఖిలాడీ డిజాస్టర్ పోగొట్టేసింది కాబట్టి ఈ రామారావు బలంగా కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి గోపిచంద్ వదులుకున్న అవకాశాన్ని రామ్, నాగ చైతన్య, రవితేజలు ఎలా వాడుకుంటారో చూడాలి