Movie News

లావణ్య త్రిపాఠి మాస్ పంచ్


సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా వివాదంగా మార్చేవాళ్లు, కౌంటర్లు వేసే వాళ్లు రెడీగా ఉంటారు. ఇలా కూడా ఆలోచిస్తారా అనిపించేలా కామెంట్లు పెడుతుంటారు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా ఆమె మహేంద్రసింగ్ ధోనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. ఈ రోజు ధోని బర్త్ డేని అభిమానులు ట్విట్టర్లో మామూలుగా సెలబ్రేట్ చేయట్లేదు. ధోని గొప్పదనాన్ని చాటే ఫొటోలు, వీడియాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ క్రమంలో లావణ్య కూడా ‘హ్యాపీ బర్త్ డే ఫేవరెట్’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. దీనికి ఒక నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. విదేశాల్లో ఇలా సెలబ్రెటీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే సంప్రదాయం ఉండదని.. జనాలు తమ పని తాము చేసుకుంటుంటారని.. ఇలాంటి పనికి మాలిన పనుల కోసం టైం వేస్ట్ చేయరు అనే విధంగా అతను పోస్ట్ పెట్టాడు. ఐతే లావణ్య ఆలస్యం చేయకుండా అతడికి దిమ్మదిరిగే పంచ్ ఇచ్చింది.

‘‘వాళ్లకు అమాయకులను కాల్చి పడేయడానికి మాత్రమే సమయం ఉంటుందేమో. అది చాలా బాధాకరం’’ అని రిప్లై ఇచ్చింది లావణ్య. అమెరికా లాంటి దేశాల్లో అకారణంగా అమాయకులను కాల్చి చంపేస్తున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. స్కూళ్లలోకి దూరి చిన్న పిల్లల్ని చంపేయడం.. రోడ్డు మీద కనిపించ వాళ్లనల్లా షూట్ చేయడం లాంటి ఉదంతాలు తరచుగా జరుగుతున్నాయి. మోడర్న్ సొసైటీగా చెప్పుకునే చోట్ల ఇలాంటి దారుణాలు చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సొసైటీని కొనియాడుతూ తనకు పంచ్ ఇవ్వాలని చూసిన నెటిజన్‌కు లావణ్య మాస్ రిప్లై ఇచ్చింది. దెబ్బకు ఆ వ్యక్తి కాసేపటికే ట్వీట్ డెలీట్ చేసి వెళ్లిపోయాడు.

కాగా లావణ్య కొత్త చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లావణ్య గత చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వకపోవడంతో ఆమె కెరీర్ కొంచెం నెమ్మదించింది. ఇలాంటి టైంలో తను లీడ్ రోల్ చేసిన సినిమాపై ఆమె చాలా ఆశలే పెట్టుకుంది.

This post was last modified on July 7, 2022 4:22 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago