రెండు పండగల మీద ‘మెగా’ కర్చీఫ్

టాలీవుడ్ లో సంక్రాంతి , దసరా సీజన్స్ లో విడుదలయ్యే సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పండగలకు స్కూల్స్ , కాలేజీలు దాదాపు పది రోజుల పైనే సెలవలు ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్ లో థియేటర్స్ కి ఎక్కువ వస్తారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఈ సీజన్స్ లో బ్లాక్ బస్టర్స్ కొట్టేయొచ్చు. అందుకే ఈ పండుగలకు నెలల ముందే కర్చీపులు వేసేస్తారు స్టార్ హీరోలు.

అయితే ఈసారి ఈ రెండు పండుగల మీద మెగా కర్చీఫ్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (వర్కింగ్ టైటిల్) ను వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని రోజులకే చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ డేట్ కూడా చెప్పేసి షాక్ ఇచ్చారు. చిరంజీవి , సల్మాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా కి రిలీజ్ చేయబోతున్నారు.

ఇలా తెలుగులో రెండు పెద్ద పండగలకు మెగా స్టార్ ముందే కర్చీఫ్ వేసేసి మిగతా హీరోలకు చాన్స్ ఇవ్వకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నారు. ఇటు దసరా సీజన్ తో పాటు అటు సంక్రాంతి సీజన్ లో కూడా రికార్డు కలెక్షన్స్ రాబట్టాలనేది మెగాస్టార్ మెగా స్కెచ్. మరి ఈ రెండు సినిమాల రిలీజ్ ఎనౌన్స్ మెంట్ తో విజయదసమి, మకర సంక్రాంతి ని మెగా ఫెస్టివల్స్ గా మార్చేసిన చిరు ఎలాంటి హిట్లు కొడతారో వేచి చూడాల్సిందే.