Movie News

వారసుడిని చుట్టుకున్న కాపీ గోల

సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్దమో అంత త్వరగా అంతు చిక్కడం లేదు. ఫేస్ బుక్కులు, ట్విట్టర్ లు జనాల స్మార్ట్ ఫోన్స్ లో సింహభాగం ఆక్రమించాక సినిమాలకు సంబంధించిన ప్రతి విషయమూ వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రిలీజ్ కు ముందు అది ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని కాపీ కొట్టి తీశారని నెటిజెన్లు నానా రచ్చ చేస్తే ఏకంగా దాని దర్శకుడు లైన్లోకొచ్చి అవునా నిజమా అంటూ హంగామా చేశారు. విడుదల దాకా ఈ హడావిడి జోరుగానే సాగింది.

కట్ చేస్తే రెండు సినిమాలు చూసిన వాళ్లకు పోలికలు కనిపించిన మాట వాస్తవం. దీన్ని కాసేపు పక్కనపెడితే ఇప్పుడు వారసుడికి ఈ భూతం తగులుకునేలా ఉంది. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన స్టోరీ ఇదేనంటూ కొన్ని మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఓ బడా బిలియనీర్ చనిపోతే ఎక్కడో రహస్యంగా పెరుగుతున్న వారసుడు తిరిగి వచ్చి తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే వారసుడు కథగా అందులో పేర్కొన్నారు.

లార్గో వించ్, అజ్ఞాతవాసిలోనూ మెయిన్ పాయింట్ ఇదే. ఇప్పుడా ఆ డైరెక్టర్ జెరోమ్ సల్లే మళ్ళీ రంగంలోకి దిగి అవునా అంటూ రీ ట్వీట్లు చేస్తుండటం అసలు ట్విస్ట్. కేవలం టైటిల్ ని పట్టుకుని ఈ స్టోరీని అల్లారా లేక ఏదైనా లీక్ బయటికి వచ్చిందా అనేది కనీసం ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ లో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. 2023 సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న వారసుడు మీద విక్రమ్ రికార్డులు బ్రేక్ చేయాలన్న ఒత్తిడి ఫ్యాన్స్ నుంచి వస్తోంది

This post was last modified on July 5, 2022 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

20 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago