‘బాహుబలి’ రిలీజ్ టైంలో బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఆ సినిమాను కొనియాడారు. దర్శకుడు రాజమౌళి మీద ప్రశంసల జల్లు కురిపించారు. మిగతా ఇండస్ట్రీల జనాలు కూడా ఆ సినిమాను, జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే. కానీ ఆ సమయానికి తప్పక జక్కన్నను కొనియాడారు కానీ.. ఒక ప్రాంతీయ సినిమాతో ఆయన ఆ స్థాయి విజయం సాధించడం, భారత సినీ చరిత్రలోనే మరే చిత్రానికీ సాధ్యం కాని రీచ్ అందుకోవడం వేరే ఇండస్ట్రీల వాళ్లకు రుచించక లోలోన అసూయ చెందారన్నది వాస్తవం.
అందుకే రాజమౌళి తర్వాతి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజవుతుంటే ఎవ్వరూ కిక్కురుమనలేదు. విడుదలకు ముందు, తర్వాత వేరే ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులందరూ మౌనం వహించారు. ‘ఆర్ఆర్ఆర్’ సైతం ‘బాహుబలి’కి దీటుగా వసూళ్ల మోత మోగించి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసినా ఎవ్వరూ మాట్లాడలేదు. ఇంతకుముందు ‘బాహుబలి’కి ఎలివేషన్ ఇచ్చి తమ కొంపకి నిప్పు పెట్టుకున్నట్లయిందని, ఇంకోసారి రాజమౌళి సినిమాను కొనియాడడం లాంటివి చేయొద్దని వేరే ఇండస్ట్రీల ప్రముఖులంతా బలంగా ఫిక్సయినట్లుగా కనిపించింది ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ టైంలో. అయినా సరే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.1200 కోట్ల వసూళ్లు సాధించింది.
తమ సినిమాలకు 50 కోట్ల వసూళ్లు కూడా కష్టమవుతున్న సమయంలో జక్కన్న చిత్రం ఈ స్థాయి కలెక్షన్లు వస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’ను హాలీవుడ్ ప్రముఖులు ఆకాశానికెత్తేస్తుంటే ఇతర పరిశ్రమలకు చెందిన వాళ్లు అసూయతో రగిలిపోతున్నారని స్పష్టమవుతోంది. చాలామంది లోలోన రగిలిపోతూ మౌనం వహిస్తుంటే.. సౌండ్ డిజైనర్ రసూల్ పొకుట్టి తన అసూయనంతా బయట పెట్టేశాడు.
ఆస్కార్ అవార్డు సాధించిన తనను రాజమౌళి ఎప్పుడూ సంప్రదించకపోవడం తనకు రుచించకపోయి ఉండొచ్చు. అదే సమయంలో రాజమౌళి మళ్లీ మళ్లీ బాక్సాఫీస్‌ను తన సినిమాలతో షేక్ చేస్తుండటం, ఇంటర్నేషనల్ అప్రిసియేషన్ పొందుతుండటం కంటగింపుగా మారి ఉండొచ్చు. చాలామంది ఈ విషయంలో బయట పడలేక లోలోన రగిలిపోతుంటే.. రసూల్ మాత్రం తన జలసీని దాచుకోలేక ఇలా సోషల్ మీడియాకు దొరికిపోయాడు. తన కెరీర్లో ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ‘గే మూవీ’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ను తక్కువ చేసే ప్రయత్నం చేసి ఆ కామెంట్‌ను కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోతోంది. ‘పుష్ప-2’ నుంచి అతణ్ని తప్పించాలనే డిమాండ్‌తో తెలుగు నెటిజన్లు సోషల్ మీడియాను హోరెత్తిస్తుండటం గమనార్హం.
This post was last modified on July 5, 2022 3:04 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…