అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ తెరంగేట్రం చేసి అప్పుడే 20 ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా అతను తన కెరీర్లో కీలక మలుపులు, విశేషాల గురించి ‘రోడ్ టు 20’ పేరుతో ఒక సిరీస్ లాగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనను హీరోగా పరిచయం చేయమని ఎంతోమంది దర్శకులు, నిర్మాతలను అడిగి నిరాశ పడాల్సి వచ్చిందని వెల్లడించాడు.
చివరికి జేపీ దత్తా ‘రెఫ్యూజీ’తో తనను హీరోగా లాంచ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే అభిషేక్ ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తన కూతురు ఆద్య ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో తాను ఎన్నో సినిమాలు వదులుకున్నట్లు చెప్పాడు. చిన్న అమ్మాయి అయిన ఆద్య కోసం అభిషేక్ సినిమాలు వదులుకోవడం ఏంటన్న సందేహం కలుగుతోంది కదా. దీనికి అతను బదులిచ్చాడు.
తాను సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు చేస్తే.. ఆద్యకు ఊహ తెలిశాక అవి చూసి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చాలా సినిమాలు వదులుకున్నట్లు అభిషేక్ వెల్లడించాడు. ఎనిమిదేళ్ల కిందట ఆద్య పుట్టినప్పటి నుంచి తాను సినిమాల్లో అలాంటి సన్నివేశాల్లో నటించడం లేదని అతను తెలిపాడు. రేప్పొద్దున ఆద్య తాను హీరోయిన్లతో చేసిన గాఢమైన శృంగార సన్నివేశాలు చూసి ఏంటివని అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలని అనిపించిందని.. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడం మానేశానని అభిషేక్ వెల్లడించాడు.
తనను పాత్రల కోసం దర్శకులు కలిసినపుడు.. ఇలాంటి సీన్లు ఏమైనా ఉంటే తాను చేయలేనని.. వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చని మర్యాదపూర్వకంగానే చెప్పేశానని.. ఇలా ఎన్నో సినిమాలు వదులుకున్నానని.. కానీ అందుకు ఎంతమాత్రం పశ్చాత్తాపపడట్లేదని.. ఇకముందూ ఇదే పాలసీని కొనసాగిస్తానని చెప్పాడు అభిషేక్.
This post was last modified on June 29, 2020 12:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…