‘జ్యోతి లక్ష్మి’ తో హీరోగా పరిచయమైన సత్య దేవ్ తీరిక లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘బ్లఫ్ మాస్టర్’ తో దక్కిన గుర్తింపు, క్రేజ్ తో ఈ కుర్ర హీరోకి మంచి ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే సరైన హిట్ పడకుండానే ఘాడీ లాగిస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘గాడ్సే’ కూడా సత్య దేవ్ కి ఆశించిన విజయం అందించలేకపోయింది. ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా మార్నింగ్ షోకి టికెట్లు తెంచలేకపోయింది. దానికి తోడు టాక్ తేడా కొట్టడంతో సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా అందుకోలేక డిజాస్టర్ అనిపించుకుంది.
నిజానికి సత్యదేవ్ చేస్తున్న ప్రతీ సినిమా నటుడిగా తనకి పేరు తెచ్చిపెడుతుంది. ఇంటెన్స్ యాక్టింగ్ తో మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటున్నాడు. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ కుర్ర హీరో ఆశలన్నీ ‘గుర్తుందా శీతాకాలం’ మీదే ఉన్నాయి. కన్నడ లో వచ్చిన ‘లవ్ మాక్ టైల్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఈ నెలలోనే రిలీజ్ అనుకుంటున్నారు. ఆ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించి మళ్ళీ సైలెంట్ అయిపోయారు.
ఈ సినిమాకు తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంది. ఆమె గ్లామర్ తో సినిమా ఓ మోస్తరు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. కానీ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ డ్రామా సినిమాలతో సందేశాలు ఇస్తున్న సత్య దేవ్ ని ఆడియన్స్ రొమాంటిక్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారా ? అనేది డౌటే. సత్య దేవ్ హీరోగా ఏ మేరకు మెప్పిస్తాడు అనేది పక్కన పెడితే ఈసారి తమన్నా సపోర్ట్ తో అయినా కచ్చితంగా ఓ హిట్టు మాత్రం కొట్టాల్సిందే. లేదంటే ఈ కుర్ర హీరో కి ఎన్ని సినిమాలు చేసిన మార్కెట్ రాదు. ఇండస్ట్రీలో ఎప్పుడైనా సక్సెస్ మేటర్. హిట్టు లేని హీరోకి ఎంతకాలమని ఆఫర్లు వస్తాయి ?
This post was last modified on %s = human-readable time difference 6:15 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…