Movie News

ట్రోలింగ్ కి దొరికిపోయిన లైగర్

సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉన్న జమానాలో పోస్టర్లు టీజర్లు వదిలే విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ట్రోలింగ్ కి టార్గెట్ అయిపోయి హాట్ టాపిక్ గా మారిపోవడం ఒక్కోసారి నెగటివ్ పబ్లిసిటీకి దారి తీయొచ్చు. లైగర్ వరస చూస్తుంటే అలాగే ఉంది. ఇందాక ఈ సినిమా తాలూకు ఒక కొత్త పోస్టర్ ని టీమ్ రిలీజ్ చేసింది. విజయ్ దేవరకొండ దాదాపు నగ్నంగా ఉన్న ఈ స్టిల్ లో ప్రైవేట్ పార్ట్ మీద రోజా పూల గుత్తిని అడ్డం పెట్టడం తప్ప మిగిలినదంతా ఓపెన్ గా చూపించేసి ఆన్లైన్ లో వదిలారు.

మాములుగా అయితే ఇదో ట్రెండ్ సెట్టింగ్ టాపిక్ అయ్యేది. కానీ ఇదే తరహాలో గతంలోనూ ఫస్ట్ లుక్కులు వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్ గా పోలికలు తెస్తూ రౌడీ బాయ్ ని పూరి జగన్నాధ్ ని టార్గెట్ చేస్తున్నారు నెటిజెన్లు. కొన్ని నెలల క్రితం సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్ కు అచ్చం ఇలాగే టైటిల్ లో కాయగూరను హీరో బాడీ మీద చూపించి పబ్లిసిటీ చేశారు. ఇదీ ఒరిజినల్ ఐడియా కాదు. అమీర్ ఖాన్ పీకే టైంలో ఇదే తరహాలో న్యూడ్ బాడీ మీద రేడియో అడ్డం పెట్టుకున్న పోజు అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో ఫ్యాన్స్ తో అందరికీ గుర్తే.

సరిగ్గా ఇక్కడే లైగర్ దొరికిపోయాడు. ఇదెక్కడి క్రియేటివిటీ అంటూ కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అయినా కంటెంట్ మాట్లాడితే బాగుంటుంది కానీ ఇలాంటి వైరల్ పోస్టర్లతో జనం సెటైర్లు వేసేలా చేయడం ఏమిటనే విమర్శలు లేకపోలేదు. ఇవన్నీ విజయ్ పూరి ఛార్మీలకు తెలిసే జరిగిందో లేక ఈ ఐడియా వేసినవాళ్లకు పైన చెప్పిన రెండు సినిమాలు గుర్తుకు రాలేదో ఏమో కానీ మొత్తానికి టాక్ అఫ్ ది మీడియాగా దీన్ని మార్చేశారు. ఆగస్ట్ 25న విడుదల కాబోతున్న లైగర్ తో అనన్య పాండే హీరోయిన్ గా పరిచయమవుతోంది

This post was last modified on July 2, 2022 12:31 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

7 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

9 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

9 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

9 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

13 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

13 hours ago