యాక్షన్ ఎంటర్టైనర్లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న నటుడు గోపీచంద్. యజ్ఞం, రణం, లక్ష్యం, లౌక్యం.. ఇలా అతడి కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి. ఐతే 2014లో ‘లౌక్యం’తో కెరీర్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్నాక గోపీకి సరైన విజయమే లేదు. ‘సీటీమార్’ లాంటి కొన్ని సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. గోపీ కోరుకున్న విజయాన్నయితే ఇవ్వలేదు. దీంతో ఈసారి తన శైలికి కొంచెం భిన్నంగా.. కామెడీ-ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ తరం దర్శకుడు మారుతితో జట్టు కట్టాడతను.
గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ‘పక్కా కమర్షియల్’పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజైన ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. గోపీ నిరీక్షణ ఈసారి కచ్చితంగా ఫలించేలాగే కనిపిస్తోంది.
మారుతి మార్కు ఎంటర్టైన్మెంట్‌తో పాటు.. గోపీ శైలిలో కొంచెం యాక్షన్ కూడా జోడించినట్లున్నారు. హీరోతో పాటు హీరోయిన్ రాశి ఖన్నా, సత్యరాజ్‌ల పాత్రలు కూడా ట్రైలర్లో బాగానే ఆకర్షించాయి. యాక్షన్ సంగతి పక్కన పెడితే మారుతి మార్కు ఎంటర్టైన్మెంటే సినిమాకు బలంలా కనిపిస్తోంది. అది వర్కవుట్ అయితే సినిమా హిట్టయినట్లే. ఈసారి రిజల్ట్ తేడా కొడితే చాలా కష్టం కాబట్టి గోపీచంద్ ఉత్కంఠతో ఉండే ఉంటాడు.
ప్రభాస్‌తో సినిమాకు ముందు హిట్ మారుతికి కూడా చాలా అవసరం. అలాగే ఈ మధ్య కొన్ని సినిమాలు తేడా కొట్టిన నేపథ్యంలో గీతా ఆర్ట్స్ వాళ్లు కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. మరి వీళ్లందరి ఆశ నెరవేరుతుందేమో చూడాలి. దీంతో పాటుగా ఈ వీకెండ్లో మాధవన్ బహుభాషా చిత్రం ‘రాకెట్రీ’ కూడా రిలీజవుతోంది. తెలుగులో చిన్న స్థాయిలోనే ఈ సినిమా రిలీజవుతోంది. మాధవన్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన ఈ బయోపిక్ ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి. దీంతో పాటు షికారు, టెన్త్ క్లాస్ డైరీస్, డబ్బింగ్ మూవీ ఏనుగు కూడా రిలీజవుతున్నాయి. ఐతే వీటికి పెద్దగా బజ్ కనిపించడం లేదు.
This post was last modified on July 1, 2022 9:49 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…