Movie News

ఆరు నెలల్లో ఏడే హిట్లు

చూస్తుండగానే కొత్త ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయాయి. మరి ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అన్నది ఒకసారి చూడాలి. కరోనా కారణంగా గతంతో పోలిస్తే ఈ ఏడాది కూడా రిలీజ్‌లు తగ్గాయి. సక్సెస్ రేట్ గురించి చెప్పేదేముంది? ఎప్పట్లాగే 10-15 శాతం మధ్యే ఉంది. ఆరు నెలల్లో నిఖార్సయిన హిట్లు అని చెప్పాలంటే ఏడు మాత్రమే.

ఈ ఏడాదికి ఓవరాల్ వసూళ్ల పరంగా చూసినా.. థియేటర్లను కళకళలాడించిన సినిమాగా చెప్పుకున్నా తెలుగులో బిగ్గెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’యే. ఆ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అన్ని వసూళ్ల రికార్డులనూ బద్దలుకొట్టేసింది. ప్రతి ఏరియాలోనూ బాహుబలి రికార్డులను తుడిచిపెట్టేసింది. ఏకంగా రూ.250 కోట్ల షేర్ రాబట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ అన్ని భాషల వసూళ్లు రూ.1200 కోట్లకు చేరుకోవడం విశేషం.

దీని తర్వాత అత్యధిక వసూళ్లు సాధించింది.. డబ్బింగ్ సినిమా కావడం విశేషం. అదే.. కేజీఎఫ్-2. ఈ చిత్రం సంచలన వసూళ్లతో డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక వసళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్ర వరల్డ్ వైడ్ వసూళ్లు ‘ఆర్ఆర్ఆర్’ను మించి రూ.1240 కోట్లకు చేరుకోవడం విశేషం.

ఇక తెలుగులో పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ అంటే.. ‘డీజే టిల్లు’ అనే చెప్పాలి. ఈ చిత్రం పెట్టుబడి మీద మూణ్నాలుగు రెట్లు లాభం తీసుకురావడం విశేషం. ఈ క్యారెక్టర్ జనాలకు మామూలుగా ఎక్కలేదు. సంక్రాంతికి వచ్చిన ‘బంగార్రాజు’ డివైడ్ టాక్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరిలో రిలీజైన పవన్ కళ్యాణ్ మూవీ అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ అయింది. ఏపీలో టికెట్ల రేట్లు పెరిగాక సినిమా రిలీజై ఉంటే ఇది సూపర్ హిట్టయ్యేది. ఆ అవకాశం లేకపోవడంతో అతి కష్టంపై బ్రేక్ ఈవెన్ అయింది. కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలు వచ్చినా.. ఓవరాల్‌గా అది హిట్ కేటగిరీలోకి చేర్చదగ్గ చిత్రమే.

ఇక జూన్ నెలలో రిలీజైన ‘మేజర్’తో పాటు డబ్బింగ్ మూవీ ‘విక్రమ్’ సైతం బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఈ నెల మొత్తం బాక్సాఫీస్‌ను కళకళలాడించింది ఈ రెండు చిత్రాలే. ఇక ఈ ఆరు నెలల్లో వచ్చిన మిగతా చిత్రాలేవీ సక్సెస్ కాలేదు. సర్కారు వారి పాట, ఎఫ్-3 లాంటి పెద్ద సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. అవి ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ కాలేదు కాబట్టి ఫ్లాప్‌ల కిందే లెక్క. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు అనుకున్నంతగా రాకపోవడంతో ఎబోవ్ యావరేజ్‌గా నిలిచింది. ‘సమ్మతమే’ అనే చిన్న సినిమా కూడా ఓ మోస్తరు ఓపెనింగ్స్‌తో ఈ కేటగిరీలోనే చేరింది.

రాధేశ్యామ్, ఆచార్య లాంటి భారీ చిత్రాలు భారీ నష్టాలతో టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ల జాబితాలో చేరాయి. నాని సినిమా ‘అంటే సుందరానికీ’కి డీసెంట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గానే నిలిచింది. ‘విరాటపర్వం’ పరిస్థితి దయనీయం. కంటెంట్ రిచ్‌యే అయినా డిజాస్టర్ అయింది. ఆడవాళ్లు మీకు జోహార్లు, ఖిలాడి, గుడ్ లక్ సఖి, హీరో, రౌడీ బాయ్స్, సెబాస్టియన్, స్టాండప్ రాహుల్, గని, భళా తందనాన, శేఖర్, గాడ్సే, చోర్ బజార్.. ఇవన్నీ డిజాస్టర్లే అయ్యాయి. డబ్బింగ్ సినిమాల్లో ఈటి, వలిమై, సామాన్యుడు, బీస్ట్.. ఇవేవీ కూడా ఆకట్టుకోలేదు.

This post was last modified on June 30, 2022 10:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago