ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు జరుగుతున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాలో అలియా భట్టే హీరోయినన్న ప్రచారం జోరుగా జరిగింది. ఎవరో అనడం కాదు ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వార్తకు మరింత ప్రాచుర్యం దక్కింది. మంచి జంటను తెరపై చూడొచ్చన్న ఆనందం తారక్ ఫ్యాన్స్ లో సోషల్ మీడియా వేదికగా కనిపించింది. ఇంతలో కేవలం రోజుల వ్యవథిలో అలియా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో యంగ్ టైగర్ టీమ్ కొత్త జోడి కోసం నెలల తరబడి వేట కొనసాగిస్తూనే ఉంది.
ఇదంతా జరగడం వెనుక పెద్ద ట్విస్టే ఉందట. రన్బీర్ కపూర్ తో పెళ్లికి డేట్ ఫిక్స్ కావడానికి ముందే ఇద్దరూ వీలైనంత త్వరగా తల్లితండ్రులు కావాలని నిర్ణయించుకున్నారట. ఒకవేళ కొత్త మూవీకి కమిట్ అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించే సున్నితంగా నో చెప్పేశారు. ఈ కారణాన్ని ఇంకా వివాహం కాకుండానే బయటికి చెప్తే ఫ్యాన్స్ ఊరికే లేనిపోని రచ్చ చేస్తారని గుర్తించి ఆ విషయాన్ని గుట్టుగా ఉంచేశారు. కేవలం నెలల వ్యవధిలో అలియాకు గర్భనిర్ధారణ కావడంతో ఇదంతా నిజమనేపిస్తోంది.
ప్రస్తుతం పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేయడానికి స్పెయిన్ వెళ్లే ఆలోచనలో రన్బీర్ అలియాలు ఉన్నట్టు ముంబై రిపోర్ట్.ఇప్పుడు ఎన్నో నెల అనే విషయం చెప్పడం లేదు కానీ అదేమంత సీరియస్ గా ఆలోచించాల్సిన ఇష్యూ అయితే కాదు. సెప్టెంబర్ లో విడుదల కాబోయే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ ప్రమోషన్లో అలియా పాల్గొనడం మీద అనుమానాలున్నాయి. ప్యాన్ ఇండియా లెవెల్ లో టీమ్ భారీ పబ్లిసిటీని ప్లాన్ చేసుకుంది. తానే తెలుగు వెర్షన్ కి సమర్పకుడు కావడంతో రాజమౌళి స్వయంగా ఆ బాధ్యతలు చూసుకోబోతున్నారు.
This post was last modified on June 30, 2022 5:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…