నాగార్జున నూరవ మైలురాయి ఎవరితో

ఏ హీరోకైనా వందో సినిమా అంటే చాలా స్పెషల్. ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే మూవీ చేయాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అవి ఫలిస్తాయి ఇంకొన్నిసార్లు తేడా కొడతాయి.చిరంజీవి ఏరికోరి తన సెంచరీ చిత్రంగా స్వంత బ్యానర్లో త్రినేత్రుడు చేస్తే అది ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. బాలకృష్ణ నూరవ సినిమాగా గౌతమి పుత్రశాతకర్ణి చేస్తే అది మంచి విజయాన్నే నమోదు చేసుకుంది కానీ మరీ చరిత్రలో నిలిచిపోయేంత కాదు. ఇక వెంకటేష్ డెబ్భై అయిదు మైలురాయి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది.

ఇప్పుడు అక్కినేని నాగార్జున వంతు వచ్చింది. చిన్న చిన్న క్యామియోలను పక్కనపెడితే ఆయన చేసిన సినిమాల కౌంట్ ది ఘోస్ట్, బ్రహ్మాస్త్రతో కలిపి తొంభై ఎనిమిది అవుతుంది. ఒకవేళ గెస్ట్ రోల్స్ కలుపుకుంటే మాత్రం ఇంకో పది తోడవుతాయి. సో వీటిని మినహాయించాల్సిందే. మరి తన హండ్రెడ్ మూవీని నాగ్ ఎవరి చేతిలో పెడతారనే కుతూహలం అభిమానుల్లో మొదలయ్యింది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు పేరు వినిపిస్తోంది కానీ వ్యక్తిగతంగా ఆయన అంత ఆసక్తిగా దర్శకత్వం చేసే ఆలోచనలో లేరని తెలిసింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఎవరు.

సీనియర్లతో కాకుండా ఇప్పుడు ఫామ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్లలో ఒకరిని ఎంచుకోవాలని నాగ్ చూస్తున్నారు. అయితే ఫామ్ లో ఉన్నవాళ్ళంతా బిజీగా ఉన్నారు. కమిట్ మెంట్స్ తో ఫుల్ ప్యాక్ అయిపోయారు. అందులోనూ కింగ్ ఇమేజ్ కు తగ్గ పవర్ఫుల్ సబ్జెక్టు కావాలి. అదంత సులభం కాదు. సినిమాలు వేగంగా చేయడంలో నాగార్జున తొందరపడటం లేదు. తొంభై తొమ్మిదోది కూడా డిసైడ్ కావాలి. ఇప్పటికైతే చర్చలు తప్ప ప్రకటనలు రాలేదు. వీటి కన్నా యాక్టివ్ గా నాగార్జున బిగ్ బాస్ మీద ఫోకస్ పెడుతున్నారు. మరి ఫ్యాన్స్ నిరీక్షణకు చెక్ పెడుతూ ప్రాజెక్ట్ విషయంలో నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.