యువ కథానాయకుడు రామ్ ఇప్పుడు మంచి ఊపుమీదున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి తన ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన రామ్.. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘రెడ్’తో కూడా ఓ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దీని తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామితో అతను చేసిన ‘వారియర్’కు మంచి క్రేజ్ వచ్చింది. దీనికి ప్రి రిలీజ్ బిజినెస్ రామ్ కెరీర్లోనే అత్యధిక స్థాయిలో జరిగింది.
‘వారియర్’ తర్వాత బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్‌తో అతను ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణకు సిద్ధమవుతూనే కొత్త కథలు వింటున్నాడు రామ్. తాజా సమాచారం ప్రకారం అతను తమిళ విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేసే అవకాశం ఉందట. వీరి మధ్య కథా చర్చలు జోరుగా జరుగుతున్నట్లు సమాచారం.
గౌతమ్ గతంలో విక్టరీ వెంకటేష్‌తో ‘ఘర్షణ’ చేశాడు. అక్కినేని నాగచైతన్యతో ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలు తీశాడు. ‘ఘర్షణ’ మూవీ తనే తీసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కాక్క కాక్క’కు రీమేక్. చైతూతో తీసిన రెండు సినిమాలు.. సమాంతరంగా తమిళంలో శింబు హీరోగా చేసినవే. ఇప్పుడు రామ్‌తో గౌతమ్ ఒక రీమేక్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన ఆర్థిక వివాదాల కారణంగా అనుకోకుండా చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్.. కొన్ని నెలల కిందటే శింబు హీరోగా ‘వెందు తనిందదు కాదు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ యాక్షన్ మూవీని సెప్టెంబరు 15న విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ కథనే తెలుగులో రామ్‌తో తీయాలని గౌతమ్ భావిస్తున్నాడట. స్క్రిప్టు రెడీగా ఉండడం, ఆల్రెడీ తీసిన సినిమా కావడంతో చాలా వేగంగా లాగించేయాలని గౌతమ్ భావిస్తున్నాడు. రామ్ ఓకే అంటే నిర్మాత దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ కాంబినేషన్లో నిజంగానే సినిమా వస్తుందేమో చూడాలి.
This post was last modified on June 30, 2022 1:00 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…