ఓ స్టార్ డైరెక్టర్ చిన్న సినిమాను సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నాడంటే దానికి కచ్చితంగా ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. తాజాగా రాజమౌళి లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్ డే’ ను ప్రమోట్ చేయడంతో ఆడియన్స్ దీని వెనుక రీజన్ ఏమిటా? అనుకుంటున్నారు.
నిజానికి రాజమౌళితో పాటు అతని కుటుంబం అంతా మిగతా సినిమాల ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు. రాజమౌళి మాత్రం కొన్ని ఆబ్లికేషణ్స్ మీద కొన్ని సార్లు మీడియా ముందుకొచ్చి లేదా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో మిగతా సినిమాల గురించి పోస్ట్ చేస్తాడు. తాజాగా హ్యాపీ బర్త్ డే కోసం జక్కన్న ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా మీద హైప్ తీసుకొచ్చాడు.
అయితే రాజమౌళి ఈ చిన్న సినిమాను ప్రమోట్ చేయడానికి ఓ రీజన్ ఉంది. ఈ సినిమా దర్శకుడు గతంలో ‘మత్తు వదలరా’ అనే సినిమా చేశాడు. అందులో హీరో కీరవాణి కొడుకు సింహా కోడూరు. సింహా ని హీరోగా పరిచయం చేసి రాజమౌళి కుటుంబానికి దర్శకుడు రితేష్ రానా బాగా దగ్గరయ్యాడు.
పైగా ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చింది కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ. తన కుటుంబం నుండి సింహా ని హీరోగా పరిచయం చేసి ఓ డీసెంట్ హిట్ ఇచ్చిన రితేష్ కి కృతజ్ఞతగా రాజమౌళి అతని రెండో సినిమాను సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నాడు.
ఎదేమైనా రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు ఓ చిన్న సినిమా మీద చేయి వేసి ప్రమోట్ చేస్తే దానికి అంతో ఇంతో బజ్ వస్తుంది. హ్యాపీ బర్త్ డే కి కచ్చితంగా అది హెల్ప్ అవుతుందనుకోవచ్చు. కానీ జక్కన్న ఇలా తనకి కావాల్సిన, పరిచయం ఉన్న వ్యక్తులకే కాకుండా మంచి టాలెంట్ తో చిన్న సినిమాలు తీసే మిగతా వారిని కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on June 29, 2022 9:25 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…