చాలామంది నటులకు, దర్శకులకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఒకటుంటుంది. ముందే ఫలానా సినిమాను డ్రీమ్ ప్రాజెక్ట్ అని భావించేవాళ్లు కొందరైతే.. ఒక సినిమా మొదలయ్యాక కూడా కొందరికది డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మారుతుంటుంది. మాధవన్ కెరీర్లో ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ కూడా అలాంటి సినిమానే.
దేశం కోసం ఎంతో చేసి, ఆపై దేశద్రోహిగా ముద్ర వేయించుకుని, అనేక అవమానాలు ఎదుర్కొని, చివరికి కోర్టులో ఎడతెగని పోరాటంతో పులు కడిగిన ముత్యంలా బయటికి వచ్చిన గ్రేట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా మాధవన్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది.
ముందు వేరే దర్శకుడితో, నిర్మాతతో మొదలైన ఈ సినిమా.. తర్వాత పూర్తగా మాధవన్ చేతుల్లోకే వచ్చింది. అదే దర్శకత్వం వహించి, సొంతంగా సినిమాను నిర్మించాడు. స్క్రిప్ట్ రీసెర్చ్, ప్రి ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ.. ఇలా అన్ని పనులూ దగ్గరుండి చూసుకోవడం నాలుగేళ్లకు పైగా మాధవన్ ఈ సినిమాకే అంకితం కావాల్సి వచ్చింది.
ఎట్టకేలకు ‘రాకెట్రీ’ జులై 1న బహు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రమోషన్లలో పాల్గొన్న మాధవన్.. సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఈ సినిమాలో నంబి నారాయణన్ జీవితాన్ని చూస్తే ఒక భారతీయుడు ఇంత చేశారా అనిపిస్తుంంది. మామూలుగా బయోపిక్స్ తీస్తున్నా సరే.. కమర్షియల్ సక్సెస్ కోసం కొన్ని మసాలా అంశాలను జోడించాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమాకు ఆ అవసరమే రాలేదు. నంబి జీవితంలో అంత డ్రామా ఉంది. తెరపై చూపించిందంతా నిజం అని జనాలు నమ్మితే చాలు. మామూలుగా సినిమాల్లో మనం చూసే డ్రామాకు మించి నంబి జీవితంలో ఎన్నో రసవత్తర మలుపులు ఉన్నాయి. ఆ డ్రామాకు కనెక్ట్ అయి సినిమాను హిట్ చేస్తారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందెన్నడూ చూడని సన్నివేశాలు ‘రాకెట్రీ’లో ఉంటాయి. ఈ సినిమా కోసం నేను ప్రోస్థెటిక్ మేకప్ వాడకుండా సహజంగా బరువు పెరిగి, సహజంగానే తగ్గి, నా పలు వరసల్ని కూడా మార్చుకుని నటించా” అని మాధవన్ తెలిపాడు.
This post was last modified on June 29, 2022 3:41 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…