మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాల జాబితాలో ఇంకో ప్రాజెక్టు చేరింది తాజాగా. మారుతి దర్శకత్వంలో తాను ఒక సినిమా చేసే అవకాశాలున్నట్లుగా పక్కా కమర్షియల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే యువి క్రియేషన్స్ అధినేతల్లో ఒకడైన విక్కీ ఈ ప్రపోజల్ తన ముందు పెట్టగా.. మారుతితో సినిమా చేయడానికి ఓకే చెప్పి ఏర్పాట్లు చేసుకోమని మాత్రమే చెప్పినట్లు చిరు వెల్లడించాడు. అంతకుమించి వివరాలేమీ చెప్పలేదు.
పక్కా కమర్షియల్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మారుతి ఈ సినిమా గురించి మాట్లాడాడు. తనతో సినిమా గురించి చిరంజీవి ఇలా ఓ పబ్లిక్ ఈవెంట్లో ప్రకటించడం కంటే ఆనందం ఇంకేముంటుందని మారుతి అన్నాడు. ఇది తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచినట్లు తెలిపాడు.
ఐతే చిరుతో సినిమాకు ఇప్పటిదాకా కథ అంటూ ఏమీ ఓకే కాలేదని.. ఆ ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో పని చేయడానికి ఇంకా సమయం ఉందని మారుతి అన్నాడు. ఇక ప్రభాస్‌తో సినిమా చేయడం గురించి తొలిసారిగా అధికారిక ప్రకటన చేశాడు మారుతి. బాహుబలి స్టార్‌తో తాను సినిమా చేయబోతున్న మాట వాస్తవమే అన్నాడు. ఐతే ఈ సినిమా ఏ జానర్‌లో తెరకెక్కుతుందని, ఎప్పుడు మొదలవుతుంది అన్నది మారుతి వెల్లడించాడు.
గతంలో మాత్రం ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్, బుజ్జిగాడు తరహాలో ప్రభాస్ అభిమానులకు నచ్చే ఎంటర్టైనర్ చేయబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు మారుతి. ప్రభాస్‌కు హోం బేనర్ అనదగ్గ యువి క్రియేషన్స్‌లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఆ బేనర్లో ప్రభాస్.. మిర్చి, సాహో, రాధేశ్యామ్ చిత్రాలలు చేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబరులో సెట్స్ మీదికి వెళ్లబోతోంది.
This post was last modified on June 27, 2022 9:56 pm
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…