గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసిన మారుతి ఆ సినిమా రిలీజ్ హడావుడిలో ఉన్నాడు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మారుతి. తాజాగా ప్రభాస్ తో తను చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తో ఏ తరహా సినిమా చేయబోతున్నారు ? హారర్ జోనర్ అంటున్నారు నిజమేనా ? టైటిల్ అదేనా ? అనే ప్రశ్నలకు సమాధానం చెప్తూ మాట్లాడాడు మారుతి.
ప్రభాస్ సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. సినిమా కూడా వాళ్ళే తీసేస్తారేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు మారుతి. అయితే ప్రభాస్ ని ఎలా చూపించాలో తనకి ఓ క్లారిటీ ఉందని అలాగే చూపించే ప్రయత్నం చేస్తానని అన్నాడు.
నేను ఎలాంటి సినిమా చేయగలనో అందరికీ తెలుసని నా జోనర్ , నా కామెడీ నచ్చే అప్రోచ్ అవుతారని నా మార్క్ లోనే సినిమా చేస్తానని అన్నాడు. ఇక ఈ విషయంపై ఓ ఉదాహరణ కూడా చెప్పాడు దర్శకుడు. “మనం నాటుకోడి బాగా వండుతామని తెలిసి మనల్ని పిలిచినప్పుడు మనకి వచ్చిన వంటే చేసి పెట్టాలి తప్ప మనకి రాని చైనీస్ వంట వండకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు.
మారుతి మాటల్ని బట్టి చూస్తే ప్రభాస్ సినిమా తన మార్క్ లోనే ఉండబోతుందని, కాకపోతే ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చని అర్థమవుతుంది. ప్రస్తుతానికి ప్రభాస్ -మారుతి సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదు. కొందరు రైటర్స్ తో మారుతి కథా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఫైనల్ నెరేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ లాక్ చేసుకోనున్నాడు మారుతి. ఈ ప్రాజెక్ట్ ‘పక్కా కమర్షియల్’ రిజల్ట్ పై కూడా ఆధారపడి ఉంది. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రాజెక్ట్ ఇంకా డిలే అవ్వడం ఖాయం.
This post was last modified on June 27, 2022 1:27 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…