ప్రారంభమైన కొత్తలో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆహ ఓటీటీ రాను రాను మంచి ప్రోగ్రామ్స్ డెలివరీ చేసి సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంది. ఇక బాలయ్య తో చేసిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఆహాను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. ఈ టాక్ షో ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసి ఆహా సబ్ స్క్రిప్షన్ తీసుకునేలా చేసింది. అయితే సీజన్ ఎండ్ అయిపోయాక మళ్ళీ ఆ స్థాయి షో ఆహాలో పడలేదు. ఇండియన్ ఐడల్ ఓ మోస్తరుగా సక్సెస్ అయ్యింది అంతే.
అయితే ఇప్పుడు మళ్ళీ బాలయ్య తో అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలు పెట్టె ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే బాలయ్య నుండి మరోసారి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఆహా టీం ప్రస్తుతం ఈ షో సీజన్ 2 లో ఎలాంటి గెస్టులను తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. మొదటి ఎప్సిసోడ్ తో బజ్ క్రియేట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి ని మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత వెంకటేష్ , నాగార్జున కూడా ఈ సీజన్ లో కనిపిస్తారని తెలుస్తుంది.
బాలయ్య – నాగార్జున కి అప్పట్లో ఏదో గొడవ జరిగిందని టాక్ స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ వైజాగ్ లో ఓ ఈవెంట్ లో కలుసుకొని ఆ వార్తలకి చెక్ పెట్టారు. ఇప్పుడు నాగ్ బాలయ్య షో లో కనిపిస్తే ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతుంది. సీజన్ 1 లో బాలయ్య -రవితేజ ల ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చినట్టే ఈ ఎపిసోడ్ లో కూడా అలాంటివి ప్లాన్ చేయబోతున్నారట. ఇక చిరు -బాలయ్య కూడా కొన్నాళ్ళుగా దూరంగా ఉంటున్నారు. పొలిటికల్ వివాదాలతో రెండు కుటుంబాల మధ్య సంబంధం తెగింది. మరి చిరు బాలయ్య షో కి వస్తే ఆ వివాదం ముగుస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి బాలయ్య టాక్ షో సీజన్ 2 మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆహా ఓంకార్ తో ఓ డాన్స్ షో నిర్వహిస్తుంది. దాని తర్వాత బాలయ్య షో మొదలు కానుంది.
This post was last modified on June 22, 2022 11:37 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…