ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ గ్రాండియర్లే విడుదలైన యాభై రోజులకు ఓటిటిలో వస్తుంటే ఎనిమిది నెలల క్రితం రిలీజైన ఓ మీడియం బడ్జెట్ మూవీ ఇప్పుడు డిజిటల్ లో రావడమంటే విచిత్రమే. పెళ్లి సందDకి అదే జరిగింది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో శ్రీకాంత్ వారసుడు రోషన్, హీరోయిన్ శ్రీలీలని పరిచయం చేస్తూ తీసిన ఈ ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద హిట్టేం కాదు. జరిగిన బిజినెస్ కి థియేటర్లలో డబ్బులు బాగానే వచ్చాయి కానీ చూసిన వాళ్ళెవరూ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన దాఖలాలు లేవు.
కట్ చేస్తే చూడనివాళ్ళ సంఖ్య కూడా భారీగానే ఉంది. సరే ఓటిటిలో చూద్దామంటే నెలలు గడుస్తున్నా ఎంతకీ రాలేదు. టీవీ ఛానల్ లోనూ ఊసు లేదు. ముఖ్యంగా కీరవాణి పాటలు, శ్రీలీల గ్లామర్ షోని చిన్న తెరపై ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్ళకు నిరాశే మిగిలింది. ఎట్టకేలకు వాళ్ళ ఎదురు చూపులు ఫలించి ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది తెలియడం ఆలస్యం సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ రియాక్షన్లే కనిపించాయి. మాములుగా ఇంత లేట్ ప్రీమియర్ అంటే ఎవరూ పట్టించుకోరు.
దీనికి కారణం ఒకటే. రిలీజ్ టైంలో పెళ్లి సందD టీమ్ అడిగిన రేట్ కి ఓటిటిలు ఒప్పుకోలేదు. దాంతో ఆ చర్చల మధ్య పుణ్యకాలం గడిచిపోయింది. యుట్యూబ్ లో వీడియో సాంగ్స్ మాత్రం హల్చల్ చేశాయి. ఏది ఎలా ఉన్నా దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే టైపులో వేడి ఉండగానే పాలు కాచుకోవాలి. అంతే తప్ప ఇంత జాప్యం చేస్తే సామాన్య ప్రేక్షకుల్లో ఓటిటి ప్రీమియర్ల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. అన్నట్టు ఈ పెళ్లి సందD ద్వారానే రాఘవేంద్రరావు గారు నటుడిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 22, 2022 11:34 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…