టాలీవుడ్లో కొందరు ఇమేజ్ లేని హీరోలను స్టార్లుగా.. స్టార్లను సూపర్ స్టార్లుగా చేసిన ఘనత పూరీ జగన్నాథ్‌కు దక్కుతుంది. ఐతే బయటి హీరోల కెరీర్లకు అంతగా ఉపయోగపడ్డ పూరి.. సొంత కొడుకును మాత్రం హీరోగా నిలబెట్టడంలో ఇప్పటిదాకా విజయవంతం కాలేకపోయాడు. టీనేజీలో ఉండగా ఆంధ్రాపోరి లాంటి సినిమా చేయించడం పెద్ద తప్పిదం అయితే.. అతణ్ని హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా లాంటి సాధారణ చిత్రం తీయడం ఇంకో పెద్ద తప్పు.
కొడుక్కి తాను సొంతంగా హిట్టివ్వలేకపోయిన పూరి.. తర్వాత అతణ్ని తన శిష్యుడు అనిల్ పాడూరి చేతికి అప్పగించాడు. పూరి కథతో అనిల్ తీసిన రొమాంటిక్ కూడా నిరాశనే మిగిల్చింది. ఇప్పుడిక ఆకాశ్ ఆశలన్నీ చోర్ బజార్ మీదే ఉన్నాయి. జార్జిరెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రమిది. దీని టైటిల్, మొదట్లో వచ్చిన ప్రోమోలు ఆసక్తికరంగానే అనిపించాయి.
కానీ తర్వాత సినిమా వార్తల్లో లేకుండా పోయింది. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. బాక్సాఫీస్ చాలా డల్లుగా ఉన్న టైంలో, సరైన బజ్ లేకుండా రిలీజవుతోంది చోర్ బజార్. దీంతో పోలిస్తే కిరణ్ అబ్బవరం సినిమా సమ్మతమేకే కాస్త బజ్ కనిపిస్తోంది.
ఆకాశ్ చివరి సినిమా రొమాంటిక్ అంతిమంగా ఫ్లాపే అయినప్పటికీ.. అందులోని ఘాటు దృశ్యాలతో పాటలు, ఇతర ప్రోమోలు రిలీజ్ చేయడం.. విడుదల ముంగిట పూరి పనిగట్టుకుని ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేయడం, ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేయడం, సెలబ్రెటీలకు స్పెషల్ షో వేసి కొడుక్కి ఎలివేషన్లు ఇప్పించడంతో బజ్ క్రియేటైంది. ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ చోర్ బజార్ విషయంలో పూరి ఏం పట్టనట్లు ఉంటున్నాడు. చోర్ బజార్ సినిమాకు ఏ పెద్ద పేర్లూ అటాచ్ అయి లేని నేపథ్యంలో కొడుకు సినిమాను పూరీనే ఇలా వదిలేస్తే దానికి ఇంకెక్కడ బజ్ క్రియేటవుతుంది?
This post was last modified on June 21, 2022 10:13 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…