పూరి.. కొడుకుని అలా వ‌దిలేశాడేంటి?

టాలీవుడ్లో కొంద‌రు ఇమేజ్ లేని హీరోల‌ను స్టార్లుగా.. స్టార్ల‌ను సూప‌ర్ స్టార్లుగా చేసిన ఘ‌న‌త పూరీ జ‌గ‌న్నాథ్‌కు ద‌క్కుతుంది. ఐతే బ‌య‌టి హీరోల కెరీర్ల‌కు అంత‌గా ఉప‌యోగ‌ప‌డ్డ పూరి.. సొంత కొడుకును మాత్రం హీరోగా నిల‌బెట్ట‌డంలో ఇప్ప‌టిదాకా విజ‌య‌వంతం కాలేక‌పోయాడు. టీనేజీలో ఉండ‌గా ఆంధ్రాపోరి లాంటి సినిమా చేయించ‌డం పెద్ద త‌ప్పిదం అయితే.. అత‌ణ్ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ మెహ‌బూబా లాంటి సాధార‌ణ చిత్రం తీయ‌డం ఇంకో పెద్ద త‌ప్పు.

కొడుక్కి తాను సొంతంగా హిట్టివ్వ‌లేక‌పోయిన పూరి.. త‌ర్వాత అత‌ణ్ని త‌న శిష్యుడు అనిల్ పాడూరి చేతికి అప్ప‌గించాడు. పూరి క‌థ‌తో అనిల్ తీసిన రొమాంటిక్ కూడా నిరాశ‌నే మిగిల్చింది. ఇప్పుడిక ఆకాశ్ ఆశ‌ల‌న్నీ చోర్ బ‌జార్ మీదే ఉన్నాయి. జార్జిరెడ్డి ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి రూపొందించిన చిత్ర‌మిది. దీని టైటిల్, మొద‌ట్లో వ‌చ్చిన ప్రోమోలు ఆస‌క్తిక‌రంగానే అనిపించాయి.

కానీ త‌ర్వాత సినిమా వార్త‌ల్లో లేకుండా పోయింది. ఇప్పుడు చ‌డీచ‌ప్పుడు లేకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. బాక్సాఫీస్ చాలా డ‌ల్లుగా ఉన్న టైంలో, స‌రైన బ‌జ్ లేకుండా రిలీజ‌వుతోంది చోర్ బ‌జార్‌. దీంతో పోలిస్తే కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమా స‌మ్మ‌త‌మేకే కాస్త బ‌జ్ క‌నిపిస్తోంది.

ఆకాశ్ చివ‌రి సినిమా రొమాంటిక్ అంతిమంగా ఫ్లాపే అయిన‌ప్ప‌టికీ.. అందులోని ఘాటు దృశ్యాల‌తో పాటలు, ఇత‌ర ప్రోమోలు రిలీజ్ చేయ‌డం.. విడుద‌ల ముంగిట పూరి ప‌నిగ‌ట్టుకుని ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు ప్లాన్ చేయ‌డం, ప్రి రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా చేయ‌డం, సెల‌బ్రెటీల‌కు స్పెష‌ల్ షో వేసి కొడుక్కి ఎలివేష‌న్లు ఇప్పించ‌డంతో బ‌జ్ క్రియేటైంది. ఓపెనింగ్స్ వ‌చ్చాయి. కానీ చోర్ బ‌జార్ విష‌యంలో పూరి ఏం ప‌ట్ట‌న‌ట్లు ఉంటున్నాడు. చోర్ బ‌జార్ సినిమాకు ఏ పెద్ద పేర్లూ అటాచ్ అయి లేని నేప‌థ్యంలో కొడుకు సినిమాను పూరీనే ఇలా వ‌దిలేస్తే దానికి ఇంకెక్క‌డ బ‌జ్ క్రియేట‌వుతుంది?