Movie News

టాలీవుడ్ ఈ కాన్సెప్ట్ వదిలేస్తే బెటర్

నక్సలిజం నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి గతంలో. కృష్ణవంశీ ‘సింధూరం’ ఈ బ్యాక్‌డ్రాప్‌లో కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఐతే 2000 ముందు వరకు ఈ నేపథ్యంలో ఏ సినిమా వచ్చినా మంచి ఆదరణే ఉండేది. కానీ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నక్సలిజం ప్రభావం అంతకంతకూ తగ్గిపోయి.. ఆ కాన్సెప్టే మరుగున పడిపోయింది. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో నక్సలిజం ఉంది కానీ.. తెలుగు రాష్ట్రాల వరకైతే ఆ ప్రభావం చాలా తక్కువ. జనాలు ఈ కాన్సెప్ట్‌తోనే పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయారని చెప్పాలి.ఆ ప్రభావం సినిమాల మీదా పడుతోంది.

ఇప్పుడు సొసైటీలో అసలేమాత్రం చర్చనీయాంశం కాని ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు తీస్తుంటే జనాలు ఏమాత్రం నచ్చక తిరస్కరిస్తుండటం గమనార్హం. కొన్ని వారాల కిందటే ‘ఆచార్య’ సినిమా వచ్చింది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరో. ఆయన నక్సలైట్ పాత్రలోనే కనిపించాడు. చరణ్ సైతం కాసేపు ఆ పాత్రలో మెరిశాడు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో పెద్ద ఎపిసోడే ఉంటుంది ఈ చిత్రంలో. కానీ జనాలకు అది అస్సలు రుచించలేదు. ఇప్పుడు ‘విరాటపర్వం’ విషయంలోనూ జరిగింది అదే. ‘ఆచార్య’తో పోలిస్తే ఇది మెరుగైన సినిమానే అయినా.. పూర్తగా నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాతో ఇప్పటి ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు.

ఒకప్పుడైతే నక్సలైట్ల గురించి రోజూ జనాలు పేపర్లు, టీవీల్లో చూసేవారు. వాళ్ల గురించి చర్చించుకునేవారు. నక్సల్స్ ప్రభావం చాలా ప్రాంతాల మీద నేరుగా ఉండేది. కానీ ఇప్పుడు అవేవీ లేకపోవడంతో ఈ తరం యువతకు నక్సలైట్ల విషయంలో ఎమోషనల్ కనెక్షన్ అన్నదే లేదు. అలాంటపుడు వాళ్ల మీద సినిమాలు తీస్తే వాళ్లకెలా రుచిస్తుంది? సామాజికంగా చూసినా.. నక్సలిజం అన్నది ఔట్ డేటెడ్ కాన్సెప్ట్. సినిమాల పరంగా చూసినా అదే భావన ఉంది ఇప్పటి జనాలకు. కాబట్టి టాలీవుడ్ ఇక ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేయడం బెటరేమో.

This post was last modified on June 20, 2022 12:35 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

21 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

29 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

44 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

45 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago