టాలీవుడ్ టాప్ స్టార్లలో చాలా జాగ్రత్తగా, ఆచితూచి సినిమాలు చేసేది ఎవరు అంటే అల్లు అర్జున్ పేరే చెప్పాలి. సినిమాల ఎంపికలో, కథలపై జడ్జిమెంట్ విషయంలో తండ్రి అల్లు అరవింద్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బన్నీ.. అంత ఆషామాషీగా ఏ సినిమానూ ఒప్పుకోడు. అందుకే వేరే స్టార్లతో పోలిస్తే అతడి సక్సెస్ రేట్ ఎక్కువ. అలాగే తన కెరీర్లో డిజాస్టర్లు కూడా తక్కువే.
‘వరుడు’ మాత్రమే అతడి కెరీర్లో పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కూడా ఇదే స్థాయిలో డిజాస్టర్ అయినప్పటికీ.. అది చెత్త సినిమా అయితే కాదు. ‘నా పేరు సూర్య’ తర్వాత సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు బన్నీ. ‘అల వైకుంఠపురములో’తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు హీరో.. ‘పుష్ప’తో ఇంకా పెద్ద విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప-2’ మీదే అతడి ఫోకస్ మొత్తం నిలిచి ఉంది. ఈ సినిమాకు ముందు ఆరు నెలలకు పైగానే గ్యాప్ వచ్చినా అతను వేరే సినిమా కోసం ప్రయత్నించలేదు.
‘పుష్ప-2’ త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుండగా.. దీని తర్వాత బన్నీ చేసే సినిమా ఏదనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. దసరాకు బన్నీ కొత్త సినిమా ప్రకటన ఉంటుందని అతడి స్నేహితుడు, నిర్మాత బన్నీ వాసు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన రావడం బన్నీ కొత్త మూవీ మీద ఊహాగానాలు మొదలైపోయాయి.
‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో బన్నీ కొత్త చిత్రం ఉంటుందని వార్తలు పుట్టించేశారు. కానీ బన్నీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్లో సినిమా రావట్లేదు. బన్నీతో వెంటనే సినిమా చేయడానికి లోకేష్ అసలు రెడీగా లేడు. తమిళంలోనే అతడికి వేరే కమిట్మెంట్లు చాలానే ఉన్నాయి. ముందుగా ఏడాది చివర్లో విజయ్ సినిమాను మొదలుపెట్టాలి. తర్వాత విక్రమ్-2, ఖైదీ-2 చేయాలి.
తెలుగులో ఏ స్టార్‌తో అయినా సినిమా ఉంటుంది అంటే.. అది ముందు రామ్ చరణ్‌తోనే. వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి గతంలో. ఇద్దరికీ కుదిరినపుడు సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. బన్నీతో అయితే ఇప్పట్లో లోకేష్ జట్టు కట్టే అవకాశాలే లేవు. నిజానికి బన్నీ వేరే దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడని.. అవి ఒక కొలిక్కి వచ్చాక మీడియాకు సమాచారం లీక్ అవుతుందని భావిస్తున్నారు.
This post was last modified on June 18, 2022 10:14 pm
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…