రామ్ గోపాల్ వర్మ స్థాయి ఏంటి.. ఈ సినిమాలేంటి అని తిట్టేవాళ్లు తిడుతున్నారు కానీ.. ఆయన మాత్రం బూతు పేరు చెప్పి భలేగా సొమ్ము చేసుకుంటున్నట్లే ఉన్నాడు. ఈ మధ్యే ఆయన్నుంచి క్లైమాక్స్ అనే కళాఖండం వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లందరూ వర్మను విపరీతంగా తిట్టిపోశారు.
అయితేనేం అది బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే బ్లాక్‌బస్టర్. థియేట్రికల్ రిలీజ్ లేకుండా, ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనూ విడుదల చేయకుండా.. సొంతంగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే డిజిటల్ ఫ్లాట్ ఫాం పెట్టి.. ఒక్క వ్యూకు రూ.100 రేటు పెట్టి రిలీజ్ చేస్తే లక్షల మంది ఎగబడి చూశారు. వర్మ ఖాతాలోకి కోట్లు వచ్చిపడ్డాయి. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు మీద ఎన్నో రెట్లు లాభాలు అందుకున్నాడు వర్మ.
ఐతే ఇప్పుడు వర్మ నుంచి మరో బూతు కళాఖండం వచ్చింది. దాని పేరు నేక్డ్. ఈసారి స్వీటీ అనే లోకల్ అమ్మాయితో మలయాళ బి-గ్రేడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో సినిమా తీసినట్లున్నాడు వర్మ. దాని పోస్టర్లు, ఇతర ప్రోమోలు చూసిన వాళ్లందరికీ స్థాయి అర్థమయ్యే ఉంటుంది. ఐతే క్లైమాక్స్‌లో అయినా ఇంటర్నేషనల్ పోర్న్ స్టార నటించింది కాబట్టి అలా ఎగబడ్డారనుకోవచ్చు.
కానీ నేక్డ్‌లో ఎవరో లోకల్ అమ్మాయి నటించినా.. ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లో, పోర్న్ సైట్లలో కుప్పలు కుప్పలుగా ఉన్నా.. ఏకంగా 200 రేటు పెట్టి చూసేందుకు కుర్రాళ్లు ఎగబడటం చిత్రమే. కేవలం 22 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా శనివారం రాత్రి 9 గంటల నుంచి స్ట్రీమ్ అవుతుంటే.. తొలి అర్ధగంటలోనే 23,560 మంది టికెట్లు కొన్నట్లు వర్మ వెల్లడించాడు. అంటే అప్పటికే 47 లక్షలకు పైగా డబ్బులొచ్చి పడ్డాయన్నమాట.
ఈ సినిమా మొత్తానికి వర్మ అండ్ కో పెట్టిన ఖర్చు కేవలం రూ.5 లక్షలట. ట్రెండ్ చూస్తుంటే మినిమం కోటి రూపాయలైనా వసూలయ్యేలా ఉంది. మొత్తానికి వర్మ యాపారం భలేగా ఉన్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on June 28, 2020 9:30 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…