మధుశాలిని గుర్తుందా? తన మోడర్న్ లుక్స్ చూసి, మోడల్‌గా కెరీర్ ఆరంభంలో తను చేసిన ప్రకటనలు అవీ చూసి చాలామంది ఏ ముంబయి భామో అయ్యుంటుదని అనుకున్నారు. కానీ ఆమె అచ్చ తెలుగు అమ్మాయే పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మన హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా మన దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోరు. వేరే భాషల కథానాయికలకే ప్రాధాన్యం ఇస్తారు. మధుశాలినికి అన్నీ ఉన్నా కూడా ఈ కారణంతోనే ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది.
కితకితలు, ఆగంతకుడు లాంటి చిన్న సినిమాలకే పరిమితం అయింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక ఆమె క్యారెక్టర్ రోల్స్ కూడా చేసింది. ఆ సమయంలోనే తమిళం నుంచి అవకాశాలు రావడంతో అటు వెళ్లిపోయింది. ‘వాడు వీడు’ సహా అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే సినిమాలు చేసింది. ఇప్పుడు తన జీవిత భాగస్వామిని కూడా మధుశాలిని కోలీవుడ్లోనే వెతుక్కోవడం విశేషం.
గోకుల్ అనే యువ నటుడిని మధుశాలిని చడీచప్పుడు లేకుండా పెళ్లాడేసింది. అసలు మధుశాలిని ప్రేమ గురించి కూడా పెద్దగా చర్చ లేదు. నేరుగా పెళ్లితోనే ఆమె వార్తల్లోకి వచ్చింది. గోకుల్ అక్కడంత పాపులర్ నటుడేమీ కాదు. చిన్నా చితకా సినిమాలే చేశాడు. కానీ మంచి అందగాడిగా పేరుంది. అతడితో మధుశాలిని పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ పెళ్లి వైపు అడుగులు వేశారు. చూడ్డానికి చిన్నమ్మాయిలా కనిపిస్తుంది కానీ.. మోడలింగ్‌తో మొదలుపెడితే మధుశాలినిది రెండు దశాబ్దాల కెరీర్ కావడం విశేషం. చివరగా ఆమె తెలుగులో ‘గూఢచారి’ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇటీవల హాట్ స్టార్ వెబ్ సిరీస్ ‘9 అవర్స్’లోనూ నటించింది.
తమిళంలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది మధు. పెళ్లి తర్వాత కూడా ఆమె కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. గోకుల్ కూడా నటుడే కావడంతో ఆ విషయంలో అభ్యంతరాలు లేకపోవచ్చు. సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on June 18, 2022 12:31 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…