ఇటీవలే పెళ్లి చేసుకుని మిసెస్ విగ్నేష్ శివన్ గా మారిన తర్వాత విడుదలైన నయనతార కొత్త సినిమా ఓ2. కాకపోతే థియేటర్లలో కాదు లెండి, డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా ఓటిటి రిలీజ్ అందుకుంది. ట్రైలర్ చూశాక ఓ మాదిరి ఆసక్తి రేగింది కానీ అసలు మూవీలో ఏమైనా మ్యాటర్ ఉందేమోనని అభిమానులు చాలా ఆశించారు. దీని దర్శకుడు పేరు విక్నేష్ కావడం గమనార్హం. క్యాస్టింగ్ పెద్ద గ్రాండ్ గా లేకపోయినా ఇంట్లోనే కూర్చుని చూసే వెసులుబాటు ఉండటంతో ఓ లుక్ వేద్దామనుకునే వాళ్ళు ఎక్కువే ఉన్నారు.
ఇంతకీ దీని టాక్ ఎలా ఉందో చూద్దాం. ఇదో సర్వైవల్ థ్రిల్లర్. అంటే ఏ సహాయం అందక ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు హీరో లేదా హీరోయిన్ చేసే పోరాటమన్న మాట. ఈ ఓ2 ఆ పాయింట్ తోనే రూపొందింది. ఊపిరితిత్తుల జబ్బుతో బాధపడుతున్న కొడుకు వీర (రిత్విక్) కు ఆపరేషన్ చేయించడానికి బస్సులో కొచ్చి తీసుకెళ్తుంది పార్వతి(నయనతార). కానీ ఆ బస్సు యాక్సిడెంట్ కు గురై ఓ లోయలోకి పడిపోయి అందరూ ఊపిరాడని ప్రమాదంలో పడతారు. అసలే అదే వ్యాధితో బాధ పడుతున్న వీరను కాపాడుకోవడం పార్వతికి ఛాలెంజ్ గా మారుతుంది. తోటి ప్రయాణికులు ఇదే సమస్యతో అల్లాడుతున్నప్పుడు తనేం చేసిందనేదే ఇందులో కథ.
ఏదో హాలీవుడ్ సినిమాలు చూసి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఎగ్జైట్ అయిపోయి స్క్రిప్ట్ మీద సీరియస్ గా దృష్టి పెట్టకుండా ప్రేక్షకులను తక్కువంచనా వేస్తే ఎలా ఉంటుందో ఓ2 ఉదాహరణగా నిలుస్తుంది. నయనతార లాంటి పవర్ ఫుల్ స్టార్ ని చేతిలో పెట్టుకుని ఇంతటి పేలవమైన కథాకథనాలతో చూసేవాళ్ల ఓపికతో ఆదుకుంటాడు విక్నేష్. మంచి ఆరిస్టులు దొరికినా సరైన డ్రామా లేక ఓ2 చాలా నిరాసక్తంగా సాగుతుంది. సాంకేతిక విభాగాలు కూడా బ్యాడ్ అవుట్ ఫుట్ కోసం కష్టపడ్డాయి. వెబ్ లో ఉన్న కంటెంట్ మొత్తం చూసేశాం అయినా బోలెడు టైం ఉందంటే తప్ప ఓ2 చూసేందుకు సరైన కారణం చెప్పలేం. నేత్రికన్ తర్వాత నయన్ రెండో ఓటిటి మూవీ ఇది.
This post was last modified on June 17, 2022 7:13 pm
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…